Matthew - మత్తయి సువార్త 8
1. ఆయన ఆ కొండమీదనుండి దిగి వచ్చినప్పుడు బహు జనసమూహములు ఆయనను వెంబడించెను.
1. When He had come down from the mountain, great multitudes followed Him.
2. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కిప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవనెను.
2. And behold, there came a leper and worshiped Him, saying, "Lord, if Thou wilt, Thou canst make me clean."
3. అందుకాయన చెయ్యి చాపి వాని ముట్టినాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్టరోగము శుద్ధి యాయెను.
3. And Jesus put forth His hand and touched him, saying, "I will: be thou clean." And immediately his leprosy was cleansed.
4. అప్పుడు యేసుఎవరితోను ఏమియు చెప్పకు సుమీ; కాని నీవు వెళ్ళి వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి కనబరచుకొని, మోషే నియమించిన కానుక సమర్పించుమని వానితో చెప్పెను
లేవీయకాండము 13:49, లేవీయకాండము 14:2, లేవీయకాండము 14:4-32
4. And Jesus said unto him, "See thou tell no man; but go thy way, show thyself to the priest, and offer the gift that Moses commanded for a testimony unto them."
5. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయనయొద్దకు వచ్చి
5. And when Jesus had entered into Capernaum, there came unto Him a centurion, beseeching Him
6. ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడియున్నాడని చెప్పి, ఆయనను వేడుకొనెను.
6. and saying, "Lord, my servant lieth at home sick with the palsy and grievously tormented."
7. యేసు నేను వచ్చి వాని స్వస్థపరచెదనని అతనితో చెప్పగా
7. And Jesus said unto him, "I will come and heal him."
8. ఆ శతాధిపతిప్రభువా, నీవు నా యింటిలోనికి వచ్చు టకు నేను పాత్రుడను కాను; నీవు మాటమాత్రము సెల విమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును.
8. The centurion answered and said, "Lord, I am not worthy that Thou shouldest come under my roof. But speak the word only, and my servant shall be healed.
9. నేను కూడ అధికారమునకు లోబడినవాడను; నా చేతిక్రింద సైనికులున్నారు; నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును, నా దాసుని ఈ పని చేయుమంటే చేయును అని యుత్తరమిచ్చెను.
9. For I am a man under authority, having soldiers under me. And I say to this man, `Go!' and he goeth; and to another, `Come!' and he cometh; and to my servant, `Do this!' and he doeth it."
10. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి, వెంట వచ్చుచున్నవారిని చూచిఇశ్రా యేలులో నెవనికైనను నేనింత విశ్వాసమున్నట్టు చూడ లేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.
10. When Jesus heard it, He marveled and said to those who followed, "Verily I say unto you, I have not found such great faith, no, not in Israel.
11. అనేకులు తూర్పునుండియు పడమటనుండియు వచ్చి అబ్రాహా ముతో కూడను, ఇస్సాకుతో కూడను, యాకోబుతో కూడను, పరలోకరాజ్యమందు కూర్చుందురు గాని
కీర్తనలు 107:3, యెషయా 59:19, మలాకీ 1:11
11. And I say unto you, that many shall come from the east and west, and shall sit down with Abraham and Isaac and Jacob in the Kingdom of Heaven.
12. రాజ్య సంబంధులు1 వెలుపటి చీకటిలోనికి త్రోయబడు దురు; అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు నుండునని మీతో చెప్పుచున్నాననెను.
12. But the children of the kingdom shall be cast out into outer darkness: there shall be weeping and gnashing of teeth."
13. అంతట యేసుఇక వెళ్ళుము; నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాకని శతాధిపతితో చెప్పెను. ఆ గడియలోనే అతనిదాసుడు స్వస్థతనొందెను.
13. And Jesus said unto the centurion, "Go thy way, and as thou hast believed, so be it done unto thee." And his servant was healed in that selfsame hour.
14. తరువాత యేసు పేతురింటిలో ప్రవేశించి, జ్వరముతో పడియున్న అతని అత్తను చూచి
14. And when Jesus had come into Peter's house, He saw his wife's mother lying and sick with a fever.
15. ఆమె చెయ్యిముట్టగా జ్వరమామెను విడిచెను; అంతట ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయసాగెను.
15. And He touched her hand, and the fever left her, and she arose and ministered unto them.
16. సాయంకాలమైనప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయనయొద్దకు తీసికొని వచ్చిరి.
16. When the evening had come, they brought unto Him many who were possessed with devils, and He cast out the spirits with His word and healed all who were sick,
17. ఆయన మాటవలన దయ్యములను వెళ్ళ గొట్టి రోగులనెల్లను స్వస్థపరచెను. అందువలనఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెనని ప్రవక్తయైన యెషయాద్వార చెప్పబడినది నెరవేరెను.
యెషయా 53:4
17. that it might be fulfilled which was spoken by Isaiah the prophet, who said, "He Himself took our infirmities and bore our sicknesses."
18. యేసు తన యొద్దనున్న జనసమూహమును చూచి అద్దరికి వెళ్ళవలెనని ఆజ్ఞాపించెను.
18. Now when Jesus saw great multitudes about Him, He gave commandment to depart unto the other side.
19. అంతట ఒక శాస్త్రి వచ్చిబోధకుడా నీ వెక్కడికి వెళ్ళినను నీ వెంటవచ్చెద నని ఆయనతో చెప్పెను.
19. And a certain scribe came and said unto Him, "Master, I will follow Thee whithersoever Thou goest."
20. అందుకు యేసునక్కలకు బొరియలును ఆకాశపక్షులకు నివాసములును కలవు గాని మనుష్యకుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలములేదని అతనితో చెప్పెను.
20. And Jesus said unto him, "The foxes have holes, and the birds of the air have nests, but the Son of Man hath nowhere to lay His head."
21. శిష్యులలో మరియొకడుప్రభువా, నేను మొదట వెళ్ళి, నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయనను అడుగగా
1 రాజులు 19:20
21. And another of His disciples said unto Him, "Lord, suffer me first to go and bury my father."
22. యేసు అతని చూచినన్ను వెంబడించుము; మృతులు తమ మృతులను పాతి పెట్టుకొననిమ్మని చెప్పెను.
22. But Jesus said unto him, "Follow Me, and let the dead bury their dead."
23. ఆయన దోనె యెక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్లిరి.
23. And when He had entered into a boat, His disciples followed Him.
24. అంతట సముద్రముమీద తుపాను లేచి నందున ఆ దోనె అలలచేత కప్పబడెను. అప్పుడాయన నిద్రించుచుండగా
24. And behold, there arose a great tempest on the sea, insomuch that the boat was covered with the waves; but He was asleep.
25. వారు ఆయన యొద్దకు వచ్చిప్రభువా, నశించిపోవుచున్నాము, మమ్మును రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి.
25. And His disciples came to Him and awoke Him, saying, "Lord, save us! We perish!"
26. అందుకాయనఅల్పవిశ్వాసు లారా, యెందుకు భయపడుచున్నారని వారితో చెప్పి, లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మళ మాయెను.
26. And He said unto them, "Why are ye fearful, O ye of little faith?" Then He arose and rebuked the winds and the sea, and there was a great calm.
27. ఆ మనుష్యులు ఆశ్చర్యపడిఈయన ఎట్టి వాడో; ఈయనకు గాలియు సముద్రమును లోబడు చున్నవని చెప్పుకొనిరి.
27. But the men marveled, saying, "What manner of man is this, that even the winds and the sea obey Him?"
28. ఆయన అద్దరినున్న గదరేనీయుల దేశము చేరగా దయ్యములు పట్టిన యిద్దరు మనుష్యులు సమాధులలో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చిరి. వారు మిగుల ఉగ్రులైనందున ఎవడును ఆ మార్గమున వెళ్లలేక పోయెను.
28. And when He had come to the other side into the country of the Gergesenes, there met Him two possessed with devils, coming out of the tombs, exceedingly fierce, so that no man might pass by that way.
29. వారుఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి? కాలము రాకమునుపే మమ్మును బాధించుటకు ఇక్కడికి వచ్చితివా? అని కేకలువేసిరి.
1 రాజులు 17:18
29. And behold, they cried out, saying, "What have we to do with Thee, Jesus, Thou Son of God? Art Thou come hither to torment us before the time?"
30. వారికి దూరమున గొప్ప పందుల మంద మేయుచుండగా
30. Now there was a good way off from them a herd of many swine feeding.
31. ఆ దయ్యములు నీవు మమ్మును వెళ్ల గొట్టినయెడల ఆ పందుల మందలోనికి పోనిమ్మని ఆయనను వేడుకొనెను.
31. So the devils besought Him, saying, "If Thou cast us out, suffer us to go away into the herd of swine."
32. ఆయన వాటిని పొమ్మనగా అవి ఆ మనుష్యులను వదలిపెట్టి ఆ పందుల లోనికి పోయెను; ఇదిగో ఆ మందంతయు ప్రపాతము నుండి సముద్రములోనికి వడిగా పరుగెత్తికొనిపోయి నీళ్లలో పడిచచ్చెను.
32. And He said to them, "Go." And when they had come out, they went into the herd of swine, and behold, the whole herd of swine ran violently down a steep place into the sea and perished in the waters.
33. వాటిని మేపుచున్నవారు పారి పోయి పట్టణములోనికి వెళ్లి జరిగిన కార్యములన్నియు దయ్యములు పట్టినవారి సంగతియు తెలిపిరి.
33. And those who kept them fled and went their ways into the city, and told everything and what had befallen the ones possessed with the devils.
34. ఇదిగో ఆ పట్టణస్థులందరు యేసును ఎదుర్కొనవచ్చి ఆయనను చూచి తమ ప్రాంతములను విడిచి పొమ్మని ఆయనను వేడుకొనిరి.
34. And behold, the whole city came out to meet Jesus. And when they saw Him, they besought Him that He would depart out of their borders.

No comments:
Post a Comment