Matthew - మత్తయి సువార్త 7

Matthew - మత్తయి సువార్త 7

1. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మునుగూర్చి తీర్పు తీర్చబడదు.

1. "Judge not, that ye be not judged.

2. మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చియు తీర్పు తీర్చబడును, మీరు కొలుచుకొలత చొప్పుననే మీకును కొలువబడును.

2. For with what judgment ye judge, ye shall be judged; and with what measure ye mete, it shall be measured to you again.

3. నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట యేల?

3. And why beholdest thou the mote that is in thy brother's eye, but considerest not the beam that is in thine own eye?

4. నీ కంటిలో దూలముండగా, నీవు నీ సహోదరుని చూచినీకంటిలో నున్న నలుసును తీసి వేయనిమ్మని చెప్ప నేల?

4. Or how wilt thou say to thy brother, `Let me pull out the mote out of thine eye,' and behold, a beam is in thine own eye?

5. వేషధారీ, మొదట నీ కంటిలో నున్న దూలమును తీసివేసికొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కన బడును.

5. Thou hypocrite, first cast out the beam out of thine own eye, and then shalt thou see clearly to cast out the mote out of thy brother's eye.

6. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందులయెదుట వేయకుడి; వేసినయెడల అవి యొకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీమీద పడి మిమ్మును చీల్చి వేయును.

6. "Give not that which is holy unto the dogs, neither cast ye your pearls before swine, lest they trample them under their feet, and turn again and rend you.

7. అడుగుడి మీకియ్యబడును. వెదకుడి మీకు దొరకును,ఒ తట్టుడి మీకు తీయబడును.

7. "Ask, and it shall be given you; seek, and ye shall find; knock, and it shall be opened unto you.

8. అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరకును, తట్టువానికి తీయ బడును.

8. For every one that asketh receiveth; and he that seeketh findeth; and to him that knocketh it shall be opened.

9. మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగినయెడల వానికి రాతినిచ్చునా? చేపను అడిగినయెడల పామునిచ్చునా?

9. "Or what man is there among you whom, if his son ask for bread, will give him a stone?

10. మీరు చెడ్డ వారై యుండియు మీ పిల్లలకు మంచి యీవుల నియ్య నెరిగి యుండగా

10. Or if he ask for a fish, will give him a serpent?

11. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటె ఎంతో నిశ్చయముగా మంచి యీవుల నిచ్చును.

11. If ye then, being evil, know how to give good gifts unto your children, how much more shall your Father who is in Heaven give good things to them that ask Him?

12. కావున మనుష్యులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో ఆలాగుననే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉప దేశము నైయున్నది.

12. Therefore, all things whatsoever ye would that men should do to you, do ye even so to them; for this is the Law and the Prophets.

13. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి; నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునైయున్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు.

13. "Enter ye in at the strait gate, for wide is the gate and broad is the way that leadeth to destruction, and many there be who go in thereat.

14. జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై యున్నది, దాని కనుగొనువారు కొందరే.

14. Because strait is the gate, and narrow is the way which leadeth unto life, and few there be that find it.

15. అబద్ధ ప్రవక్తలనుగూర్చి జాగ్రత్తపడుడి. వారు గొఱ్ఱెల చర్మములు వేసికొని మీయొద్దకు వత్తురు కాని లోపల వారు క్రూరమైన తోడేళ్లు.
యెహేజ్కేలు 22:27

15. "Beware of false prophets, who come to you in sheep's clothing, but inwardly they are ravening wolves.

16. వారి ఫలములవలన మీరు వారిని తెలిసికొందురు. ముండ్లపొదలలో ద్రాక్ష పండ్లనైనను, పల్లేరుచెట్లను అంజూరపు పండ్లనైనను కోయు దురా?

16. Ye shall know them by their fruits. Do men gather grapes from thorns, or figs from thistles?

17. ఆలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికిమాలిన చెట్టు, కానిఫలములు ఫలించును.

17. Even so, every good tree bringeth forth good fruit, but a corrupt tree bringeth forth evil fruit.

18. మంచి చెట్టు కానిఫలములు ఫలింపనేరదు, పనికిమాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు.

18. A good tree cannot bring forth evil fruit, neither can a corrupt tree bring forth good fruit.

19. మంచి ఫలములు ఫలింపని ప్రతిచెట్టు నరకబడి అగ్నిలో వేయబడును.

19. Every tree that bringeth not forth good fruit is hewn down and cast into the fire.

20. కాబట్టి మీరు వారి ఫలములవలన వారిని తెలిసికొందురు.

20. Therefore, by their fruits ye shall know them.

21. ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోకరాజ్యములో ప్రవేశింపడుగాని పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చేయువాడే ప్రవేశించును.

21. "Not every one that saith unto Me, `Lord, Lord,' shall enter into the Kingdom of Heaven, but he that doeth the will of My Father who is in Heaven.

22. ఆ దినమందు అనేకులు నన్ను చూచిప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా? అని చెప్పుదురు.
యిర్మియా 14:14, యిర్మియా 27:15

22. Many will say to Me in that Day, `Lord, Lord, have we not prophesied in Thy name, and in Thy name have cast out devils, and in Thy name done many wonderful works?'

23. అప్పుడు నేను మిమ్మును ఎన్నడును ఎరుగను, అక్రమము చేయు వారలారా, నాయొద్దనుండి పొండని వారితో చెప్పుదును.
కీర్తనలు 6:8

23. And then will I profess unto them, `I never knew you: depart from Me, ye that work iniquity.'

24. కాబట్టి యీ నా మాటలు విని వాటిచొప్పున చేయు ప్రతివాడును బండమీద తన యిల్లు కట్టుకొనిన బుద్ధి మంతుని పోలియుండును.

24. "Therefore, whosoever heareth these sayings of Mine and doeth them, I will liken him unto a wise man, who built his house upon a rock.

25. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ యింటిమీద కొట్టెను గాని దాని పునాది బండమీద వేయబడెను గనుక అది పడలేదు.

25. And the rain descended and the floods came, and the winds blew and beat upon that house; and it fell not, for it was founded upon a rock.

26. మరియు యీ నా మాటలు విని వాటిచొప్పున చేయని ప్రతివాడు ఇసుకమీద తన యిల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును.

26. And every one that heareth these sayings of Mine and doeth them not, shall be likened unto a foolish man, who built his house upon the sand;

27. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ యింటిమీద కొట్టెను, అప్పుడది కూల బడెను; దాని పాటు గొప్పదని చెప్పెను.
యెహేజ్కేలు 13:10-12

27. and the rain descended, and the floods came, and the winds blew, and beat upon that house; and it fell, and great was the fall of it."

28. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహ ములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి.

28. And it came to pass, when Jesus had ended these sayings, the people were astonished at His doctrine;

29. ఏలయనగా ఆయన వారి శాస్త్రులవలె కాక అధికారముగలవానివలె వారికి బోధించెను.

29. for He taught them as one having authority, and not as the scribes.

No comments:

Post a Comment