Corinthians II - 2 కొరింథీయులకు 5
1. భూమిమీద మన గుడారమైన యీ నివాసము శిథిలమైపోయినను, చేతిపనికాక దేవునిచేత కట్ట బడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని యెరుగుదుము.
యోబు 4:19
1. For we know that if our earthly house, this tabernacle, were dissolved, we have a building of God, a house not made with hands, eternal in the heavens.
2. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకొనినవారముగా కనబడుదుము. కాబట్టి పరలోకమునుండివచ్చు మన నివాసము దీనిపైని ధరించుకొన నపేక్షించుచు దీనిలో మూల్గుచున్నాము.
2. For in this we groan, earnestly desiring to be clothed about with our house which is from Heaven,
3. ఈ గుడారములోనున్న మనము భారము మోసికొని మూల్గు చున్నాము.
3. that, being so clothed, we shall not be found naked.
4. ఇది తీసివేయవలెనని కాదు గాని మర్త్యమైనది జీవముచేత మింగివేయబడునట్లు, ఆ నివాసమును దీనిపైని ధరించుకొన గోరుచున్నాము.
4. For we that are in this tabernacle do groan, being burdened, not because we would be unclothed, but clothed about, that mortality might be swallowed up by life.
5. దీని నిమిత్తము మనలను సిద్ధపరచినవాడు దేవుడే;మరియు ఆయన తన ఆత్మ అను సంచకరువును మన కనుగ్రహించియున్నాడు.
5. Now He that hath wrought us for this selfsame thing is God, who also hath given unto us the pledge of the Spirit.
6. వెలి చూపువలన కాక విశ్వాసమువలననే నడుచుకొను చున్నాము
6. Therefore we are always confident, knowing that, whilst we are at home in the body, we are absent from the Lord;
7. గనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామనియెరిగి యుండియు, ఎల్లప్పుడును ధైర్యముగలవారమై యున్నాము.
7. for we walk by faith, not by sight.
8. ఇట్లు ధైర్యము గలిగి యీ దేహమును విడిచి పెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము.
8. We are confident, I say, and willing rather to be absent from the body and to be present with the Lord.
9. కావున దేహమందున్నను దేహమును విడిచినను, ఆయన కిష్టులమై యుండవలెనని మిగుల అపేక్షించుచున్నాము.
9. Therefore we labor, that, whether present or absent, we may be accepted by Him.
10. ఎందుకనగా తాను జరిగించిన క్రియలచొప్పున, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును.
కీర్తనలు 72:2-4, ప్రసంగి 12:14
10. For we must all appear before the judgment seat of Christ, that every one may receive the things done in his body, according to what he hath done, whether it be good or bad.
11. కావున మేము ప్రభువు విషయమైన భయము నెరిగి మనుష్యులను ప్రేరేపించుచున్నాము. మేము దేవునికి ప్రత్యక్షపరచబడినవారము; మీ మనస్సాక్షులకు కూడ ప్రత్యక్షపరచబడియున్నామని నమ్ముచున్నాను.
11. Knowing therefore the terror of the Lord, we persuade men; but we are made manifest unto God, and I trust also are made manifest in your consciences.
12. మమ్మును మేమే మీ యెదుట తిరిగి మెప్పించుకొనుట లేదు గాని, హృదయమునందు అతిశయపడక పైరూపమునందే అతిశయపడువారికి ప్రత్యుత్తర మిచ్చుటకు మీకు ఆధారము కలుగవలెనని మా విషయమై మీకు అతిశయ కారణము కలిగించుచున్నాము.
12. For we commend not ourselves again unto you, but give you occasion to glory on our behalf, that ye may have something to answer those who glory in appearance and not in heart.
13. ఏలయనగా మేము వెఱ్రివారమైతిమా దేవుని నిమిత్తమే; స్వస్థబుద్ధిగలవారమైతిమా మీ నిమిత్తమే.
13. For if we be beside ourselves, it is for God; if we be soberminded, it is for your cause.
14. క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది; ఏలాగనగా అందరికొరకు ఒకడు మృతిపొందెను గనుక అందరును మృతిపొందిరనియు,
14. For the love of Christ constraineth us, because we thus judge that if One died for all, then all were dead;
15. జీవించువారికమీదట తమకొరకు కాక, తమ నిమిత్తము మృతిపొంది తిరిగి లేచినవానికొరకే జీవించుటకు ఆయన అందరికొరకు మృతిపొందెననియు నిశ్చయించు కొనుచున్నాము.
15. and that He died for all, that those who live should not henceforth live unto themselves, but unto Him who died for them and rose again.
16. కావున ఇకమీదట మేము శరీరరీతిగా ఎవనినైనను ఎరుగము; మేము క్రీస్తును శరీరరీతిగా ఎరిగియుండినను ఇకమీదట ఆయనను ఆలాగు ఎరుగము.
16. Therefore, henceforth know we no man according to the flesh; yea, though we have known Christ according to the flesh, yet now henceforth we know Him so no more.
17. కాగా ఎవడైనను క్రీస్తునందున్నయెడల వాడు నూతన సృష్టి; పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయెను;
యెషయా 43:18-21
17. Therefore if any man be in Christ, he is a new creature: old things are passed away; behold, all things have become new.
18. సమస్తమును దేవుని వలననైనవి; ఆయన మనలను క్రీస్తుద్వారా తనతో సమాధానపరచుకొని, ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను.
18. And all things are of God, who hath reconciled us to Himself by Jesus Christ and hath given to us the ministry of reconciliation,
19. అదేమనగా, దేవుడు వారి అపరాధములను వారిమీద మోపక, క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు, ఆ సమాధానవాక్యమును మాకు అప్పగించెను.
19. to wit, that God was in Christ, reconciling the world unto Himself, not imputing their trespasses unto them, and hath committed unto us the Word of reconciliation.
20. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమైదేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొనుచున్నాము.
యెషయా 52:7
20. Now then we are ambassadors for Christ, as though God were beseeching you by us: we pray you on Christ's stead, be ye reconciled to God.
21. ఎందుకనగా మనమాయనయందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మనకోసము పాపముగాచేసెను.
21. For He hath made Him who knew no sin to be sin for us, that we might be made the righteousness of God in Him.

No comments:
Post a Comment