Corinthians II - 2 కొరింథీయులకు 4

Corinthians II - 2 కొరింథీయులకు 4

 
1. కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై అధైర్యపడము.

1. Therefore, seeing we have this ministry, as we have received mercy we faint not,

2. అయితే కుయుక్తిగా నడుచు కొనకయు, దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు, సత్యమును ప్రత్యక్షపరచుటవలన ప్రతి మనుష్యుని మనస్సాక్షి యెదుట మమ్మును మేమే దేవుని

2. but have renounced the hidden things of dishonesty, not walking in craftiness, nor handling the Word of God deceitfully; but by manifesting the truth we commend ourselves to every man's conscience in the sight of God.

3. మా సువార్త మరుగుచేయబడిన యెడల నశించుచున్నవారి విషయములోనే మరుగుచేయ బడియున్నది.

3. But if our Gospel be hid, it is hid to those who are lost,

4. దేవుని స్వరూపియైయున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకా శింపకుండు నిమిత్తము, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైనవారి మనో నేత్రములకు గ్రుడ్డితనము కలుగ జేసెను.

4. whose unbelieving minds the god of this world hath blinded, lest the light of the glorious Gospel of Christ, who is the image of God, should shine unto them.

5. అంధకారములోనుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను.

5. For we preach not ourselves, but Christ Jesus the Lord, and ourselves your servants for Jesus' sake.

6. గనుక మేము మమ్మునుగూర్చి ప్రకటించు కొనుటలేదు గాని, క్రీస్తుయేసునుగూర్చి ఆయన ప్రభు వనియు, మమ్మునుగూర్చి, యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము.
యెషయా 9:2

6. For God, who commanded the light to shine out of darkness, hath shined in our hearts to give the light of the knowledge of the glory of God in the face of Jesus Christ.

7. అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదైయుండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు.

7. But we have this treasure in earthen vessels, that the excellency of the power may be of God, and not of us.

8. ఎటుబోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడువారము కాము; అపాయములో నున్నను కేవలము ఉపాయము లేనివారము కాము;

8. We are troubled on every side, yet not distressed; we are perplexed, but not in despair;

9. తరుమబడు చున్నను దిక్కులేనివారము కాము; పడద్రోయబడినను నశించువారము కాము.
ఆదికాండము 1:3

9. persecuted, but not forsaken; cast down, but not destroyed;

10. యేసుయొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసుయొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడును వహించు కొని పోవుచున్నాము.

10. always bearing about in the body the dying of the Lord Jesus, that the life also of Jesus might be made manifest in our body.

11. ఏలయనగా, యేసుయొక్క జీవముకూడ మా మర్త్య శరీరమునందు ప్రత్యక్ష పరచ బడినట్లు, సజీవులమైన మేము ఎల్లప్పుడు యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము.

11. For we who live are always being delivered unto death for Jesus' sake, that the life also of Jesus might be made manifest in our mortal flesh.

12. కావున మాలో మరణ మును మీలో జీవమును కార్యసాధకమగుచున్నవి.

12. So then death worketh in us, but life in you.

13. కృప యెక్కువమంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు విస్తరింపజేయులాగున, సమస్త మైనవి మీకొరకై యున్నవి.
కీర్తనలు 116:10

13. We, having the same spirit of faith, according as it is written: "I believed and therefore have I spoken" -- we also believe and therefore speak,

14. కాగా విశ్వసించితిని గనుక మాటలాడితిని అని వ్రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మగలవారమై,

14. knowing that He who raised up the Lord Jesus shall raise us up also by Jesus, and shall present us with you.

15. ప్రభువైన యేసును లేపినవాడు యేసుతో మమ్మునుకూడ లేపి, మీతోకూడ తన యెదుట నిలువ బెట్టునని యెరిగి,మేమును విశ్వసించుచున్నాము గనుక మాటలాడుచున్నాము.

15. For all things are for your sakes, that, through the thanksgiving of many, the abundant grace might redound to the glory of God.

16. కావున మేము అధైర్యపడము; మా బాహ్య పురుషుడు కృశించుచున్నను, ఆంతర్యపురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు.

16. For this cause we faint not, but though our outward man perish, yet the inward man is renewed day by day.

17. మేము దృశ్యమైనవాటిని చూడక అదృశ్యమైనవాటినే నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మాకొరకు అంత కంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగ జేయుచున్నది.

17. For our light affliction, which is but for a moment, worketh for us a far more exceeding and eternal weight of glory,

18. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు; అదృశ్యమైనవి నిత్యములు.

18. while we look not at the things which are seen, but at the things which are not seen. For the things which are seen are temporal, but the things which are not seen are eternal.

No comments:

Post a Comment