Psalms - కీర్తనలు 10

Psalms - కీర్తనలు 10

1. యెహోవా, నీ వెందుకు దూరముగా నిలుచు...చున్నావు? ఆపత్కాలములలో నీ వెందుకు దాగి యున్నావు?

1. Why standest Thou afar off, O LORD? Why hidest Thou Thyself in times of trouble?

2. దుష్టుడు గర్వించి, దీనుని వడిగా తరుముచున్నాడువారు యోచించిన మోసక్రియలలో తామే చిక్కుకొందురు గాక

2. The wicked in his pride doth persecute the poor; let them be caught in the devices that they have contrived.

3. దుష్టులు తమ మనోభిలాషనుబట్టి అతిశయపడుదురులోభులు యెహోవాను తిరస్కరింతురు

3. For the wicked boasteth of his heart's desire, and blesseth the covetous whom the LORD abhorreth.

4. దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడనుకొందురుదేవుడు లేడని వారెల్లప్పుడు యోచించుదురు

4. The wicked, in the pride of his countenance, will not seek after God; God is not in all his thoughts.

5. వారెల్లప్పడు భయము మానుకొని ప్రవర్తింతురునీ న్యాయవిధులు ఉన్నతమైనవై వారి దృష్టికి అందకుండును.వారు తమ శత్రువులనందరిని చూచి తిరస్కరింతురు.



5. His ways are always grievous; Thy judgments are far above, out of his sight; as for all his enemies, he puffeth at them.

6. మేము కదల్చబడము, తరతరములవరకు ఆపదచూడము అని వారు తమ హృదయములలో అనుకొందురు

6. He hath said in his heart, "I shall not be moved, for I shall never be in adversity."

7. వారి నోరు శాపముతోను కపటముతోను వంచనతోను నిండియున్నదివారి నాలుకక్రింద చేటును పాపమును ఉన్నవి.
రోమీయులకు 3:14

7. His mouth is full of cursing and deceit and fraud; under his tongue is mischief and vanity.

8. తామున్న పల్లెలయందలి మాటుచోటులలో పొంచియుందురుచాటైన స్థలములలో నిరపరాధులను చంపుదురువారి కన్నులు నిరాధారులను పట్టుకొనవలెనని పొంచి చూచును.

8. He sitteth in the lurking places of the villages; in secret places doth he murder the innocent; his eyes are privily set against the poor.

9. గుహలోని సింహమువలె వారు చాటైన స్థలములలో పొంచి యుందురుబాధపడువారిని పట్టుకొన పొంచి యుందురుబాధపడువారిని తమ వలలోనికి లాగి పట్టుకొందురు.

9. He lieth in wait secretly as a lion in his den; he lieth in wait to catch the poor; he doth catch the poor when he draweth him into his net.

10. కాగా నిరాధారులు నలిగి వంగుదురువారి బలాత్కారమువలన నిరాధారులు కూలుదురు.

10. He croucheth and humbleth himself, that the poor may fall by his strong ones.

11. దేెెవుడు మరచిపోయెను ఆయన విముఖుడై యెప్పుడును చూడకుండును అని వారు తమ హృదయములలో అనుకొందురు.

11. He hath said in his heart, "God hath forgotten; He hideth His face, He will never see it."

12. యెహోవా లెమ్ము, దేవా బాధపడువారిని మరువకనీ చెయ్యి యెత్తుము

12. Arise, O LORD! O God, lift up Thine hand! Forget not the humble.

13. దుష్టులు దేవుని తృణీకరించుట యేల? నీవు విచారణ చేయవని వారు తమ హృదయములలో అను కొనుటయేల?

13. Why doth the wicked contemn God? He hath said in his heart, "Thou wilt not keep account."

14. నీవు దీనిని చూచి యున్నావు గదా, వారికి ప్రతికారము చేయుటకైనీవు చేటును పగను కనిపెట్టి చూచుచున్నావునిరాధారులు తమ్మును నీకు అప్పగించుకొందురుతండ్రిలేనివారికి నీవే సహాయుడవై యున్నావు

14. But Thou hast seen it, for Thou beholdest mischief and spite, to requite it with Thy hand. The poor committeth himself unto Thee; Thou art the helper of the fatherless.

15. దుష్టుల భుజమును విరుగగొట్టుముచెడ్డవారి దుష్టత్వము ఏమియు కనబడకపోవువరకుదానిని గూర్చి విచారణ చేయుము.

15. Break Thou the arm of the wicked and the evil man; seek out his wickedness until Thou find none.

16. యెహోవా నిరంతరము రాజై యున్నాడుఆయన దేశములోనుండి అన్యజనులు నశించి పోయిరి.
ప్రకటన గ్రంథం 11:15

16. The LORD is King for ever and ever; the heathen have perished out of His land.

17. యెహోవా, లోకులు ఇకను భయకారకులు కాకుండు నట్లుబాధపడువారి కోరికను నీవు విని యున్నావు

17. LORD, Thou hast heard the desire of the humble; Thou wilt prepare their heart, Thou wilt cause Thine ear to hear,

18. తండ్రిలేనివారికిని నలిగిన వారికిని న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయము స్థిరపరచితివి,చెవియొగ్గి ఆల కించితివి.

18. to judge the fatherless and the oppressed, that the man of the earth may no more oppress.

No comments:

Post a Comment