Psalms - కీర్తనలు 9

Psalms - కీర్తనలు 9

1. నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదనుయెహోవా, నీ అద్భుతకార్యములన్నిటిని నేను వివ రించెదను.

1. I will praise Thee, O LORD, with my whole heart; I will show forth all Thy marvelous works.

2. మహోన్నతుడా, నేను నిన్నుగూర్చి సంతోషించిహర్షించుచున్నానునీ నామమును కీర్తించెదను.

2. I will be glad and rejoice in Thee; I will sing praise to Thy name, O Thou Most High.

3. నీవు నా పక్షమున వ్యాజ్యెమాడి నాకు న్యాయము తీర్చుచున్నావునీవు సింహాసనాసీనుడవై న్యాయమునుబట్టి తీర్పుతీర్చుచున్నావు

3. When mine enemies are turned back, they shall fall and perish at Thy presence.

4. కాబట్టి నా శత్రువులు వెనుకకు మళ్లుదురునీ సన్నిధిని వారు జోగిపడి నశింతురు.

4. For Thou hast maintained my right and my cause; Thou sittest on the throne judging right.

5. నీవు అన్యజనులను గద్దించి యున్నావు, దుష్టులనునశింపజేసి యున్నావువారి పేరు ఎన్నటికి నుండకుండ తుడుపు పెట్టియున్నావు.


5. Thou hast rebuked the heathen, Thou hast destroyed the wicked; Thou hast blotted out their name for ever and ever.

6. శత్రువులు నశించిరి, వారు ఎన్నడు నుండకుండనిర్మూలమైరినీవు పెల్లగించిన పట్టణములు స్మరణకు రాకుండబొత్తిగా నశించెను.

6. O thou enemy, destructions are come to a perpetual end: and Thou hast destroyed their cities; their memorial is perished with them.

7. యెహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడైయున్నాడు.న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి యున్నాడు.

7. But the LORD shall endure for ever; He hath prepared His throne for judgment.

8. యెహోవా నీతినిబట్టి లోకమునకు తీర్పు తీర్చునుయథార్థతనుబట్టి ప్రజలకు న్యాయము తీర్చును.
అపో. కార్యములు 17:31

8. And He shall judge the world with righteousness; He shall minister judgment to the people in uprightness.

9. నలిగినవారికి తాను మహా దుర్గమగునుఆపత్కాలములలో వారికి మహా దుర్గమగును

9. The LORD also will be a refuge for the oppressed, a refuge in times of trouble.

10. యెహోవా, నిన్ను ఆశ్రయించువారిని నీవు విడిచిపెట్టువాడవు కావుకావున నీ నామమెరిగినవారు నిన్ను నమ్ముకొందురు

10. And they that know Thy name will put their trust in Thee; for Thou, LORD, hast not forsaken them that seek Thee.

11. సీయోను వాసియైన యెహోవాను కీర్తించుడిఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడి.

11. Sing praises to the LORD who dwelleth in Zion! Declare among the people His doings.

12. ఆయన రక్తాపరాధమునుగూర్చి విచారణచేయునప్పుడు బాధపరచబడువారిని జ్ఞాపకము చేసికొనునువారి మొఱ్ఱను ఆయన మరువడు.

12. When He maketh inquisition for blood, He remembereth them; He forgetteth not the cry of the humble.

13. నేను నీ కీర్తి అంతటిని ప్రసిద్ధిచేయుచుసీయోను కుమార్తె గుమ్మములలోనీ రక్షణనుబట్టి హర్షించునట్లుయెహోవా, నన్ను కరుణించుము.

13. Have mercy upon me, O LORD! Consider my trouble which I suffer from them that hate me, Thou that liftest me up from the gates of death,

14. మరణద్వారమున ప్రవేశించకుండ నన్ను ఉద్ధరించువాడా,నన్ను ద్వేషించువారు నాకు కలుగజేయు బాధనుచూడుము.

14. that I may show forth all Thy praise at the gates of the daughter of Zion. I will rejoice in Thy salvation.

15. తాము త్రవ్విన గుంటలో జనములు మునిగిపోయిరి.తాము ఒడ్డిన వలలో వారి కాలు చిక్కుబడియున్నది.

15. The heathen have sunk down into the pit that they made; in the net which they hid, their own foot is taken.

16. యెహోవా ప్రత్యక్షమాయెను, ఆయన తీర్పు తీర్చియున్నాడు.దుష్టులు తాముచేసికొనినదానిలో చిక్కియున్నారు(హిగ్గాయోన్‌ సెలా.)

16. The LORD is known by the judgment which He executeth; the wicked is snared in the work of his own hands. Higgaion. Selah

17. దుష్టులును దేవుని మరచు జనులందరునుపాతాళమునకు దిగిపోవుదురు.

17. The wicked shall be turned into hell, and all the nations that forget God.

18. దరిద్రులు నిత్యము మరువబడరుబాధపరచబడువారి నిరీక్షణాస్పదము ఎన్నటికినినశించదు.

18. For the needy shall not always be forgotten; the expectation of the poor shall not perish for ever.

19. యెహోవా లెమ్ము, నరులు ప్రబలక పోవుదురు గాకనీ సన్నిధిని జనములు తీర్పు పొందుదురు గాక.

19. Arise, O LORD, let not man prevail; let the heathen be judged in Thy sight.

20. యెహోవా, వారిని భయపెట్టుముతాము నరమాత్రులమని జనులు తెలిసికొందురు గాక.(సెలా.)

20. Put them in fear, O LORD; that the nations may know themselves to be but men. Selah

No comments:

Post a Comment