Psalms - కీర్తనలు 148

Psalms - కీర్తనలు 148

1. యెహోవాను స్తుతించుడి. ఆకాశవాసులారా, యెహోవాను స్తుతించుడి ఉన్నతస్థలముల నివాసులారా, ఆయనను స్తుతించుడి

1. Praise ye the LORD! Praise ye the LORD from the heavens; praise Him in the heights!

2. ఆయన దూతలారా, మీరందరు ఆయనను స్తుతించుడి ఆయన సైన్యములారా, మీరందరు ఆయనను స్తుతిం చుడి

2. Praise ye Him, all His angels; praise ye Him, all His hosts!

3. సూర్యచంద్రులారా, ఆయనను స్తుతించుడి కాంతిగల నక్షత్రములారా, మీరందరు ఆయనను స్తుతించుడి.

3. Praise ye Him, sun and moon; praise Him, all ye stars of light!

4. పరమాకాశములారా, ఆకాశముపైనున్న జలములారా, ఆయనను స్తుతించుడి.

4. Praise Him, ye heavens of heavens, and ye waters that be above the heavens!

5. యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను అవి యెహోవా నామమును స్తుతించును గాక

5. Let them praise the name of the LORD, for He commanded and they were created.

6. ఆయన వాటిని నిత్యస్థాయువులుగా స్థిరపరచి యున్నాడు ఆయన వాటికి కట్టడ నియమించెను ఏదియు దాని నతిక్రమింపదు.

6. He hath also established them for ever and ever; He hath made a decree which shall not pass.

7. భూమిమీదనున్న మకరములారా, అగాధజలములారా, యెహోవాను స్తుతించుడి

7. Praise the LORD from the earth, ye dragons and all deeps,

8. అగ్ని వడగండ్లారా, హిమమా, ఆవిరీ, ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుపానూ,

8. fire and hail, snow and vapors, stormy wind fulfilling His word,

9. పర్వతములారా, సమస్తమైన గుట్టలారా, ఫలవృక్షములారా, సమస్తమైన దేవదారు వృక్షము లారా,

9. mountains and all hills, fruitful trees and all cedars,

10. మృగములారా, పశువులారా, నేలను ప్రాకు జీవులారా, రెక్కలతో ఎగురు పక్షు లారా,

10. beasts and all cattle, creeping things and flying fowl,

11. భూరాజులారా, సమస్త ప్రజలారా, భూమిమీద నున్న అధిపతులారా, సమస్త న్యాయాధి పతులారా, యెహోవాను స్తుతించుడి.

11. kings of the earth and all people, princes and all judges of the earth,

12. ¸యవనులు కన్యలు వృద్ధులు బాలురు

12. both young men and maidens, old men and children.

13. అందరును యెహోవా నామమును స్తుతించుదురు గాక ఆయన నామము మహోన్నతమైన నామము ఆయన ప్రభావము భూమ్యాకాశములకు పైగా నున్నది.

13. Let them praise the name of the LORD, for His name alone is excellent; His glory is above the earth and heaven.

14. ఆయన తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించి యున్నాడు. అది ఆయన భక్తులకందరికిని ఆయన చెంతజేరిన జనులగు ఇశ్రాయేలీయులకును ప్రఖ్యాతికరముగా నున్నది. యెహోవాను స్తుతించుడి.

14. He also exalteth the horn of His people, the praise of all His saints, even of the children of Israel, a people near unto Him. Praise ye the LORD!

No comments:

Post a Comment