Romans - రోమీయులకు 5

Romans - రోమీయులకు 5


1. కాబట్టి విశ్వాసమూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి, మన ప్రభువైన యేసుక్రీస్తుద్వారా దేవునితో సమాధానము కలిగియుందము

1. Therefore, being justified by faith, we have peace with God through our Lord Jesus Christ,

2. మరియు ఆయనద్వారా మనము విశ్వాసమువలన ఈ కృపయందు ప్రవేశముగల వారమై, అందులో నిలిచియుండి, దేవుని మహిమను గూర్చిన నిరీక్షణనుబట్టి అతిశయ పడుచున్నాము.

2. by whom also we have access by faith into this grace wherein we stand, and rejoice in hope of the glory of God.

3. అంతే కాదు; శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని యెరిగి

3. And not only so, but we glory in tribulations also, knowing that tribulation worketh patience;

4. శ్రమలయందును అతిశయపడు దము.

4. and patience, experience; and experience, hope;

5. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడియున్నది.
కీర్తనలు 22:5, కీర్తనలు 25:20

5. and hope maketh not ashamed, because the love of God is shed abroad in our hearts by the Holy Ghost who is given unto us.

6. ఏల యనగా మనమింక బలహీనులమై యుండగా, క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనులకొరకు చనిపోయెను.

6. For when we were yet without strength, in due time Christ died for the ungodly.

7. నీతి మంతునికొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు; మంచివానికొరకు ఎవడైన ఒకవేళ చనిపోవ తెగింప వచ్చును.

7. For scarcely will one die for a righteous man, yet perhaps for a good man some would even dare to die.

8. అయితే దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను.

8. But God commendeth His love toward us in that, while we were yet sinners, Christ died for us.

9. కాబట్టి ఆయన రక్తమువలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి, మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రతనుండి రక్షింప బడుదుము.

9. Much more then, being now justified by His blood, we shall be saved from wrath through Him.

10. ఏలయనగా శత్రువులమై యుండగా, ఆయన కుమారుని మరణముద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన యెడల సమాధానపరచబడిన వారమై, ఆయన జీవించుటచేత మరి నిశ్చయముగా రక్షింపబడు దుము.

10. For if, when we were enemies, we were reconciled to God by the death of His Son, much more, being reconciled, we shall be saved by His life.

11. అంతేకాదు; మన ప్రభువైన యేసు క్రీస్తుద్వారా మనము దేవునియందు అతిశయపడుచున్నాము; ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధానస్థితి పొంది యున్నాము.

11. And not only that, but we shall also rejoice in God through our Lord Jesus Christ, by whom we have now received the atonement.

12. ఇట్లుండగా ఒక మనుష్యునిద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో, ఆలాగుననే మనుష్యులందరు పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను.
ఆదికాండము 2:17, ఆదికాండము 3:6, ఆదికాండము 3:19

12. Therefore, as by one man sin entered into the world, and death by sin, so death passed onto all men, for all have sinned.

13. ఏలయనగా ధర్మ శాస్త్రము వచ్చిన దనుక పాపము లోకములో ఉండెను గాని ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు.

13. For until the law, sin was in the world, but sin is not imputed when there is no law.

14. అయినను ఆదాముచేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారిమీదకూడ, ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేలెను; ఆదాము రాబోవువానికి గురుతై యుండెను,

14. Nevertheless death reigned from Adam to Moses, even over those who had not sinned in the similitude of Adam's transgression, he being the figure of Him that was to come.

15. అయితే అపరాధము కలిగినట్టు కృపా వరము కలుగలేదు. ఎట్లనగా ఒకని అపరాధమువలన అనేకులు చనిపోయినయెడల మరి యెక్కువగా దేవుని కృపయు, యేసుక్రీస్తను ఒక మనుష్యుని కృ

15. But not as the offense, so also is the free gift. For if through the offense of one many be dead, much more the grace of God, and the gift by grace, which is by one Man, Jesus Christ, hath abounded unto many.

16. మరియు పాపము చేసిన యొకనివలన శిక్షావిధి కలిగినట్టు ఆ దానము కలుగ లేదు. ఏలయనగా తీర్పు ఒక్క అపరాధమూలముగా వచ్చినదై శిక్షావిధికి కారణమాయెను; కృపావరమైతే అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినదై మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమాయెను.

16. And not as it was by one who sinned, so is the gift: for the judgment was by one to condemnation, but the free gift is for many offenses unto justification.

17. మరణము ఒకని అపరాధమూలమున వచ్చినదై ఆ యొకని ద్వారానే యేలిన యెడల కృపాబాహుళ్యమును నీతిదాన మును పొందువారు జీవము గలవారై, మరి నిశ్చయముగా యేసుక్రీస్తను ఒకని ద్వారానే యేలుదురు.

17. For if by one man's offense death reigned by one, much more those who receive abundance of grace and the gift of righteousness shall reign in life by One, Jesus Christ.

18. కాబట్టి తీర్పు ఒక్క అపరాధమూలమున వచ్చినదై, మనుష్యుల కందరికిని శిక్షావిధి కలుగుటకు ఏలాగు కారణమాయెనో, ఆలాగే ఒక్క పుణ్య కార్యమువలన కృపాదానము మను ష్యులకందరికిని జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణ మాయెను.

18. Therefore as by the offense of one, judgment to condemnation came upon all men, even so by the righteousness of One, the free gift unto justification of life came upon all men.

19. ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయతవలన అనేకులు పాపులుగా ఏలాగు చేయబడిరో, ఆలాగే ఒకని విధేయతవలన అనేకులు నీతిమంతులుగా చేయబడు దురు.
యెషయా 53:11

19. For as by one man's disobedience many were made sinners, so by the obedience of One shall many be made righteous.

20. మరియు అపరాధము విస్తరించునట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను. అయినను పాపము మరణమును ఆధారము చేసికొని యేలాగు ఏలెనో,

20. Moreover the law entered, that the offense might abound. But where sin abounded, grace did much more abound,

21. ఆలాగే నిత్యజీవము కలుగుటకై, నీతిద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలునిమిత్తము పాపమెక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను.

21. that, as sin hath reigned unto death, even so might grace reign through righteousness unto eternal life by Jesus Christ our Lord.

No comments:

Post a Comment