Romans - రోమీయులకు 16

Romans - రోమీయులకు 16

 
1. కెంక్రేయలో ఉన్న సంఘపరిచారకురాలగు ఫీబే అను మన సహోదరిని, పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువు నందు చేర్చుకొని,

1. I commend unto you Phoebe our sister, who is a servant of the church which is at Cenchrea,

2. ఆమెకు మీవలన కావలసినది ఏదైన ఉన్నయెడల సహాయము చేయవలెనని ఆమెనుగూర్చి మీకు సిఫారసు చేయుచున్నాను; ఆమె అనేకులకును నాకును సహాయురాలై యుండెను.
నిర్గామకాండము 9:9-10

2. that ye receive her in the Lord as becometh saints, and that ye assist her in whatsoever business she hath need of you. For she hath been a succorer of many, and of myself also.

3. క్రీస్తు యేసునందు నా జతపనివారైన ప్రిస్కిల్లకును, అకులకును నా వందనములు చెప్పుడి.

3. Greet Priscilla and Aquila, my helpers in Christ Jesus,

4. వారు నా ప్రాణముకొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. మరియు, వారి యింట ఉన్న సంఘమునకును వందనములు చెప్పుడి; నేను మాత్రము కాదు అన్యజనులలోని సంఘములవారందరు వీరికి కృతజ్ఞులై యున్నారు.

4. who have for my life laid down their own necks, unto whom not only I give thanks, but also all the churches of the Gentiles.

5. ఆసియలో క్రీస్తుకు ప్రథమఫలమైయున్న నా ప్రియుడగు ఎపైనెటుకు వందనములు.

5. Likewise greet the church that is in their house. Salute my well-beloved Epaenetus, who is the firstfruits of Achaia unto Christ.

6. మీకొరకు బహుగా ప్రయాసపడిన మరియకు వందనములు.

6. Greet Mary, who bestowed much labor on us.

7. నాకు బంధువులును నా తోడి ఖైదీలునైన అంద్రొనీకుకును, యూనీయకును వందనములు; వీరు అపొస్తలులలో ప్రసిద్ధి కెక్కినవారై, నాకంటె ముందుగా క్రీస్తునందున్నవారు.

7. Salute Andronicus and Junia, my kinsmen and my fellow prisoners, who are of note among the apostles and who also were in Christ before me.

8. ప్రభువునందు నాకు ప్రియుడగు అంప్లీయతునకు వంద నములు.

8. Greet Amplias, my beloved in the Lord.

9. క్రీస్తునందు మన జత పనివాడగు ఊర్బానుకును నా ప్రియుడగు స్టాకునకును వందనములు.

9. Salute Urbanus, our helper in Christ, and my beloved Stachys.

10. క్రీస్తు నందు యోగ్యుడైన అపెల్లెకు వందనములు. అరిస్టొబూలు ఇంటివారికి వందనములు.

10. Salute Apelles, approved in Christ. Salute those who are of the household of Aristobulus.

11. నా బంధువుడగు హెరోది యోనుకు వందనములు. నార్కిస్సు ఇంటి వారిలో ప్రభువునందున్న వారికి వందనములు.

11. Salute Herodion, my kinsman. Greet those who are of the household of Narcissus, who are in the Lord.

12. ప్రభువునందు ప్రయాసపడు త్రుపైనాకును త్రుఫోసాకును వందనములు. ప్రియురాలగు పెర్సిసునకు వందనములు; ఆమె ప్రభువు నందు బహుగా ప్రయాసపడెను.

12. Salute Tryphena and Tryphosa, who labor in the Lord. Salute the beloved Persis, who labored much in the Lord.

13. ప్రభువునందు ఏర్పరచబడిన రూఫునకు వందనములు; అతని తల్లికి వంద నములు; ఆమె నాకును తల్లి.

13. Salute Rufus, chosen in the Lord, and his mother and mine.

14. అసుంక్రితుకును, ప్లెగో నుకును, హెర్మే కును, పత్రొబకును, హెర్మాకును వారితో కూడనున్న సహోదరులకును వందనములు.

14. Salute Asyncritus, Phlegon, Hermes, Patrobas, Hermas, and the brethren who are with them.

15. పిలొలొగు కును, యూలియాకును, నేరియకును, అతని సహోదరికిని, ఒలుంపాకును వారితోకూడ ఉన్న పరిశుద్దులకందరికిని వందనములు.

15. Salute Philologus and Julia, Nereus and his sister, and Olympas, and all the saints who are with them.

16. పవిత్రమైన ముద్దుపెట్టుకొని యొకని కొకడు వందనములు చేయుడి. క్రీస్తుసంఘములన్నియు మీకు వందనములు చెప్పుచున్నవి.

16. Salute one another with a holy kiss. The churches of Christ salute you.

17. సహోదరులారా, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతి రేకముగా భేదములను ఆటంకములను కలుగజేయు వారిని కనిపెట్టియుండుడని మిమ్మును బతిమాలుకొను చున్నాను. వారిలోనుండి తొలగిపోవుడి.

17. Now I beseech you, brethren, mark those who cause divisions and offenses, contrary to the doctrine which ye have learned, and avoid them.

18. అట్టి వారు మన ప్రభువైన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు; వారు ఇంపైన మాటలవలనను ఇచ్చకములవలనను నిష్కపటుల మనస్సులను మోసపుచ్చుదురు.

18. For such as they serve not our Lord Jesus Christ, but their own belly, and by good words and fair speeches deceive the hearts of the simple.

19. మీ విధేయత అందరికిని ప్రచుర మైనది గనుక మిమ్మునుగూర్చి సంతోషించుచున్నాను. మీరు మేలు విషయమై జ్ఞానులును, కీడు విషయమై నిష్కపటులునై యుండవలెనని కోరుచున్నాను.

19. For your obedience has become known abroad unto all men. I am glad therefore on your behalf; but yet I would have you wise unto that which is good, and simple concerning evil.

20. సమాధాన కర్తయగు దేవుడు సాతానును మీ కాళ్లక్రింద శీఘ్రముగా చితుక త్రొక్కించును. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై యుండును గాక.
ఆదికాండము 3:15

20. And the God of peace shall bruise Satan under your feet shortly. The grace of our Lord Jesus Christ be with you. Amen.

21. నా జతపనివాడగు తిమోతి నా బంధువులగు లూకియ యాసోను, సోసిపత్రు అనువారును మీకు వందనములు చెప్పుచున్నారు.

21. Timothy, my fellow worker, and Lucius and Jason and Sosipater, my kinsmen, salute you.

22. ఈ పత్రిక వ్రాసిన తెర్తియు అను నేను ప్రభువునందు మీకు వందనములు చేయుచున్నాను.

22. (I, Tertius, who wrote down this epistle, salute you in the Lord.)

23. నాకును యావత్సంఘమునకును ఆతిథ్యమిచ్చు గాయియు మీకు వందనములు చెప్పుచున్నాడు. ఈ పట్టణపు ఖజానాదారుడగు ఎరస్తును సహోదరుడగు క్వర్తును మీకు వందనములు చెప్పుచున్నారు.

23. Gaius, my host and host of the whole church, saluteth you. Erastus, the treasurer of the city, saluteth you, and Quartus, a brother.

24. మన ప్రభువైన యేసు క్రీస్తు కృప మీకు తోడై యుండును గాక.

24. The grace of our Lord Jesus Christ be with you all. Amen.

25. సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగు నట్లు, అనాదినుండి రహస్యముగా ఉంచబడి యిప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము, నిత్యదేవుని ఆజ్ఞప్రకారము ప్రవక్తల లేఖనములద్వారా వారికి తెలుపబడియున్నది. ఈ మర్మమును అనుసరించియున్న నా సువార్త ప్రకారము గాను,

25. Now to Him who has the power to establish you according to my Gospel and the preaching of Jesus Christ, according to the revelation of the mystery which was kept secret since the world began

26. యేసు క్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారముగాను, మిమ్మును స్థిరపరచుటకు శక్తిమంతుడును

26. but now is made manifest, and by the Scriptures of the prophets, according to the commandment of the everlasting God, made known to all nations for the obedience of faith,

27. అద్వితీయ జ్ఞాన వంతుడునైన దేవునికి,యేసుక్రీస్తుద్వారా, నిరంతరము మహిమ కలుగునుగాక. ఆమేన్‌.

27. to God alone wise, be glory through Jesus Christ for ever. Amen.

No comments:

Post a Comment