Matthew - మత్తయి సువార్త 23

Matthew - మత్తయి సువార్త 23

 
1. అప్పుడు యేసు జనసమూహములతోను తన శిష్యుల... తోను ఇట్లనెను

1. Then spoke Jesus to the multitude and to His disciples,

2. శాస్త్రులును పరిసయ్యులును మోషే పీఠమందు కూర్చుండువారు

2. saying, "The scribes and the Pharisees sit in Moses' seat.

3. గనుక వారు మీతో చెప్పువాటి నన్నిటిని అనుసరించిగై కొనుడి, అయినను వారి క్రియలచొప్పున చేయకుడి; వారు చెప్పుదురే గాని చేయరు.
మలాకీ 2:7-8

3. All therefore whatsoever they bid you observe, that observe and do; but do ye not according to their works; for they say, and do not.

4. మోయ శక్యముకాని భారమైన బరువులు కట్టి మనుష్యుల భుజములమీద వారు పెట్టుదురేగాని తమ వ్రేలితోనైన వాటిని కదలింపనొల్లరు.

4. For they bind heavy burdens and grievous to be borne, and lay them on men's shoulders, but they themselves will not move them with one of their fingers.

5. మనుష్యులకు కనబడునిమిత్తము తమ పనులన్నియు చేయుదురు; తమ రక్షరేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు;
నిర్గామకాండము 13:9, సంఖ్యాకాండము 15:38-39, ద్వితియోపదేశకాండము 6:8

5. But all their works they do to be seen by men. They make broad their phylacteries, and enlarge the borders of their garments,

6. విందులలో అగ్రస్థానములను సమాజ మందిరములలో అగ్రపీఠములను

6. and love the uppermost places at feasts and the chief seats in the synagogues,

7. సంత వీధులలో వందన ములను మనుష్యులచేత బోధకులని పిలువబడుటయు కోరుదురు.

7. and greetings in the markets, and to be called by men, `Rabbi, Rabbi.'

8. మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరు సహోదరులు.

8. But be not ye called `Rabbi,' for One is your Master, even Christ; and all ye are brethren.

9. మరియు భూమిమీద ఎవనికైనను తండ్రి అని పేరుపెట్టవద్దు; ఒక్కడే మీ తండ్రి; ఆయన పరలోకమందున్నాడు.

9. "And call no man your father upon earth, for One is your Father, who is in Heaven.

10. మరియు మీరు గురువులని పిలువబడవద్దు; క్రీస్తుఒక్కడే మీ గురువు.

10. Neither be ye called masters, for One is your Master, even Christ.

11. మీలో అందరికంటె గొప్పవాడు మీకు పరిచారకుడై యుండవలెను.

11. But he that is greatest among you shall be your servant.

12. తన్నుతాను హెచ్చించు కొనువాడు తగ్గింపబడును; తన్నుతాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును.
యోబు 22:29, సామెతలు 29:23, యెహేజ్కేలు 21:26

12. And whosoever shall exalt himself shall be abased, and he that shall humble himself shall be exalted.

13. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యు లారా, మీరు మనుష్యులయెదుట పరలోకరాజ్యమును మూయుదురు;

13. "But woe unto you, scribes and Pharisees, hypocrites! For ye shut up the Kingdom of Heaven against men, for ye neither go in yourselves, neither suffer ye them that are entering to go in.

14. మీరందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనియ్యరు.

14. Woe unto you, scribes and Pharisees, hypocrites! For ye devour widows' houses, and for a pretense make long prayers; therefore ye shall receive the greater damnation.

15. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్ర మును భూమిని చుట్టివచ్చెదరు; అతడు కలిసినప్పుడు అతని మీకంటె రెండంతలు

15. "Woe unto you, scribes and Pharisees, hypocrites! For ye compass sea and land to make one proselyte, and when he is made, ye make him twofold more the child of hell than yourselves.

16. అయ్యో, అంధులైన మార్గదర్శకులారా, ఒకడు దేవా లయముతోడని ఒట్టుపెట్టుకొంటె అందులో ఏమియు లేదు గాని దేవాలయములోని బంగారముతోడని ఒట్టు పెట్టుకొంటె వాడు దానికి బద్ధుడని మీరు చెప్పుద

16. "Woe unto you, ye blind guides, who say, `Whosoever shall swear by the temple, it is nothing; but whosoever shall swear by the gold of the temple, he is obligated.'

17. అవివేకులారా, అంధులారా, ఏది గొప్పది? బంగారమా, బంగారమును పరిశుద్ధపరచు దేవాలయమా?

17. Ye fools and blind! For which is greater, the gold, or the temple that sanctifieth the gold?

18. మరియుబలిపీఠముతోడని యొకడు ఒట్టుపెట్టుకొంటె, అందులో ఏమియు లేదు గాని, దాని పైనుండు అర్పణముతోడని ఒట్టుపెట్టుకొంటె దానికి బద్ధుడని మీరు చెప్పుదురు.

18. And ye say, `Whosoever shall swear by the altar, it is nothing; but whosoever sweareth by the gift that is upon it, he is liable.'

19. అవివేకులారా, అంధులారా, ఏది గొప్పది? అర్పణమా, అర్పణమును పరిశుద్ధపరచు బలిపీఠమా?
నిర్గామకాండము 29:37

19. Ye fools and blind! For which is greater, the gift, or the altar that sanctifieth the gift?

20. బలిపీఠముతోడని ఒట్టుపెట్టు కొనువాడు, దాని తోడనియు దాని పైనుండు వాటన్నిటితోడనియు ఒట్టుపెట్టుకొనుచున్నాడు.

20. Whoso therefore shall swear by the altar, sweareth by it and by all things thereon.

21. మరియు దేవాలయము తోడని ఒట్టుపెట్టుకొనువాడు, దాని తోడనియు అందులో నివసించువాని తోడనియు ఒట్టుపెట్టుకొనుచున్నాడు.
1 రాజులు 8:13, కీర్తనలు 26:8

21. And whoso shall swear by the temple, sweareth by it and by Him that dwelleth therein.

22. మరియు ఆకాశముతోడని ఒట్టుపెట్టుకొనువాడు దేవుని సింహాసనము తోడనియు దానిపైని కూర్చున్నవాని తోడనియు ఒట్టుపెట్టుకొను చున్నాడు.
యెషయా 66:1

22. And he that shall swear by Heaven, sweareth by the throne of God and by Him that sitteth thereon.

23. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యు లారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకఱ్ఱలోను పదియవ వంతు చెల్లించి, ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను, అనగా న్యాయమును
లేవీయకాండము 27:30, మీకా 6:8

23. "Woe unto you, scribes and Pharisees, hypocrites! For ye pay tithe of mint and anise and cummin, and have omitted the weightier matters of the law: judgment, mercy, and faith. These ought ye to have done and not to leave the other undone.

24. అంధులైన మార్గదర్శకులారా, దోమలేకుండు నట్లు వడియగట్టి ఒంటెను మింగువారు మీరే.

24. Ye blind guides, who strain out a gnat and swallow a camel!

25. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యు లారా, మీరు గిన్నెయు పళ్లెమును వెలుపట శుద్ధిచేయు దురు గాని అవి లోపల దోపుతోను అజితేంద్రియత్వము తోను నిండియున్నవి.
జెకర్యా 1:1

25. "Woe unto you, scribes and Pharisees, hypocrites! For ye make clean the outside of the cup and of the platter, but within they are full of extortion and excess.

26. గ్రుడ్డిపరిసయ్యుడా, గిన్నెయు పళ్లెమును వెలుపల శుద్ధియగునట్టుగా ముందు వాటిలోపల శుద్ధిచేయుము.

26. Thou blind Pharisee, cleanse first that which is within the cup and platter, that the outside of them may be clean also.

27. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యు లారా, మీరు సున్నముకొట్టిన సమాధులను పోలి యున్నారు. అవి వెలుపల శృంగారముగా అగపడును గాని లోపల చచ్చినవారి యెముకలతోను సమస

27. "Woe unto you, scribes and Pharisees, hypocrites! For ye are like unto whited sepulchers, which indeed appear beautiful outwardly, but are within full of dead men's bones and of all uncleanness.

28. ఆలాగే మీరు వెలుపల మనుష్యు లకు నీతిమంతులుగా నగపడుచున్నారు గాని, లోపల వేషధారణతోను అక్రమముతోను నిండి యున్నారు.

28. Even so, ye also outwardly appear righteous unto men, but within ye are full of hypocrisy and iniquity.

29. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యు లారా, మీరు ప్రవక్తల సమాధులను కట్టించుచు, నీతి మంతుల గోరీలను శృంగారించుచు

29. "Woe unto you, scribes and Pharisees, hypocrites! Because ye build the tombs of the prophets and garnish the sepulchers of the righteous,

30. మనము మన2 పితరుల దినములలో ఉండినయెడల ప్రవక్తల మరణ విషయములో3 వారితో పాలివారమై యుండక పోదుమని చెప్పుకొందురు.

30. and say, `If we had been in the days of our fathers, we would not have been partakers with them in the blood of the prophets.'

31. అందువలననే మీరు ప్రవక్తలను చంపినవారి కుమారులై యున్నారని మీ మీద మీరే సాక్ష్యము చెప్పుకొను చున్నారు.

31. Therefore ye are witnesses against yourselves, that ye are the children of them that killed the prophets.

32. మీరును మీ పితరుల పరిమాణము పూర్తి చేయుడి.

32. Fill ye up, then, the measure of your fathers.

33. సర్పములారా, సర్పసంతానమా, నరకశిక్షను మీ రేలాగు తప్పించుకొందురు?

33. "Ye serpents, ye generation of vipers! How can ye escape the damnation of hell?

34. అందుచేత ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను జ్ఞానులను శాస్త్రులను పంపుచున్నాను; మీరు వారిలో కొందరిని చంపి సిలువవేయుదురు, కొందరిని మీ సమాజమందిరములలో కొరడాలతొ

34. Therefore, behold, I send unto you prophets and wise men and scribes, and some of them ye shall kill and crucify, and some of them shall ye scourge in your synagogues and persecute them from city to city,

35. నీతిమంతు డైన హేబెలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును, దేవా లయమునకును మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడగు జెకర్యా రక్తమువరకు భూమిమీద చిందింపబడిన నీతి మంతుల రక్తమంతయు మీ మీదికి వచ్చును.
ఆదికాండము 4:8, 2 దినవృత్తాంతములు 24:20-21

35. that upon you may come all the righteous blood shed upon the earth, from the blood of righteous Abel unto the blood of Zechariah, son of Barachias, whom ye slew between the temple and the altar.

36. ఇవన్నియు ఈ తరమువారిమీదికి వచ్చునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

36. Verily I say unto you, all these things shall come upon this generation.

37. యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును నీయొద్దకు పంపబడినవారిని రాళ్లతో కొట్టుచును ఉండు దానా, కోడి తన పిల్లలను రెక్కలక్రింది కేలాగు చేర్చు కొనునో ఆలాగే నేనును నీ పిల్లలను ఎన్నోమారులు చేర్చు కొనవలెనని యుంటిని గాని మీరు ఒల్లకపోతిరి.

37. "O Jerusalem, Jerusalem, thou that killest the prophets and stonest them that are sent unto thee, how often would I have gathered thy children together, even as a hen gathereth her chickens under her wings, and ye would not!

38. ఇదిగో మీ యిల్లు మీకు విడువబడియున్నది
1 రాజులు 9:7-8, యిర్మియా 12:7, యిర్మియా 22:5

38. Behold, your house is left unto you desolate.

39. ఇదిమొదలుకొనిప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడుగాకని మీరు చెప్పు వరకు నన్ను చూడరని మీతోచెప్పుచున్నాను.
కీర్తనలు 118:26

39. For I say unto you, ye shall not see Me henceforth till ye shall say, `Blessed is He that cometh in the name of the Lord!'"

No comments:

Post a Comment