Matthew - మత్తయి సువార్త 20

Matthew - మత్తయి సువార్త 20

1. ఏలాగనగాపరలోకరాజ్యము ఒక ఇంటి యజ మానుని పోలియున్నది. అతడు తన ద్రాక్షతోటలో పని వారిని కూలికి పెట్టుకొనుటకు ప్రొద్దున బయలుదేరి

1. "For the Kingdom of Heaven is like unto a man that is a householder, who went out early in the morning to hire laborers into his vineyard.

2. దినమునకు ఒక దేనారము2 చొప ్పున పనివారితో ఒడబడి, తన ద్రాక్షతోటలోనికి వారిని పంపెను.

2. And when he had agreed with the laborers for a penny a day, he sent them into his vineyard.

3. తరువాత అతడు దాదాపు తొమ్మిది గంటలకు వెళ్లి సంత వీధిలో ఊరక నిలిచియున్న మరికొందరిని చూచిఒ మీరును నా ద్రాక్షతోటలోనికి వెళ్లుడి, యేమి న్యాయమో అది మీకిత్తునని వారితో చెప్పగా వారును వెళ్లిరి.

3. And he went out about the third hour and saw others standing idle in the marketplace,

4. మీరును నా ద్రాక్షతోటలోనికి వెళ్లుడి, యేమి న్యాయమో అది మీకిత్తునని వారితో చెప్పగా వారును వెళ్లిరి.

4. and said unto them, `Go ye also into the vineyard, and whatsoever is right I will give you.' And they went their way.

5. దాదాపు పండ్రెండు గంటలకును, మూడు గంటలకును, అతడు మరల వెళ్లి, ఆలాగే చేసెను.

5. Again he went out about the sixth and the ninth hour and did likewise.

6. తిరిగి దాదాపు అయిదు గంట లకు వెళ్లి, మరికొందరు నిలిచియుండగా చూచిఇక్కడ దినమంతయు మీరెందుకు ఊరకనే నిలిచియున్నారని వారిని అడుగగా

6. And about the eleventh hour he went out and found others standing idle, and said unto them, `Why stand ye here all the day idle?'

7. వారు ఎవడును మమ్మును కూలికి పెట్టుకొన లేదనిరి. అందుకతడుమీరును నా ద్రాక్షతోటలోనికి వెళ్లుడనెను.

7. They said unto him, `Because no man hath hired us.' He said unto them, `Go ye also into the vineyard, and whatsoever is right, that shall ye receive.'

8. సాయంకాలమైనప్పుడు ఆ ద్రాక్షతోట యజమానుడు తన గృహనిర్వాహకుని చూచిపనివారిని పిలిచి, చివర వచ్చినవారు మొదలుకొని మొదట వచ్చిన వారివరకు వారికి కూలి ఇమ్మని చెప్పెను.
లేవీయకాండము 19:13, ద్వితియోపదేశకాండము 24:15

8. So when evening had come, the lord of the vineyard said unto his steward, `Call the laborers and give them their hire, beginning from the last unto the first.'

9. దాదాపు అయిదు గంటలకు కూలికి కుదిరినవారు వచ్చి ఒక్కొక దేనారముచొప్పున తీసికొనిరి.

9. And when they came that were hired about the eleventh hour, they received every man a penny.

10. మొదటి వారు వచ్చి తమకు ఎక్కువ దొరకుననుకొనిరి గాని వారికిని ఒక్కొక దేనారముచొప్పుననే దొరకెను.

10. But when the first came, they supposed they should have received more; and they likewise received every man a penny.

11. వారది తీసికొని చివర వచ్చిన వీరు ఒక్కగంట మాత్రమే పనిచేసినను,

11. And when they had received it, they murmured against the master of the house,

12. పగలంతయు కష్టపడి యెండబాధ సహించిన మాతో వారిని సమానము చేసితివే అని ఆ యింటి యజ మానునిమీద సణుగుకొనిరి.

12. saying, `These last have wrought but one hour, and thou hast made them equal unto us who have borne the burden and the heat of the day.'

13. అందుకతడు వారిలో ఒకని చూచిస్నేహితుడా, నేను నీకు అన్యాయము చేయ లేదే; నీవు నాయొద్ద ఒక దేనారమునకు ఒడబడలేదా? నీ సొమ్ము నీవు తీసికొని పొమ్ము;

13. But he answered one of them and said, `Friend, I do thee no wrong. Didst thou not agree with me for a penny?

14. నీ కిచ్చినట్టే కడపట వచ్చిన వీరికిచ్చుటకును నాకిష్టమైనది;

14. Take that which is thine and go thy way. I will give unto this last, even as unto thee.

15. నాకిష్టమువచ్చి నట్టు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయము కాదా? నేను మంచివాడనైనందున నీకు కడుపుమంటగా ఉన్నదా3 అని చెప్పెను.

15. Is it not lawful for me to do what I will with mine own? Is thine eye evil, because I am good?'

16. ఈ ప్రకారమే కడపటివారు మొదటి వారగుదురు, మొదటివారు కడపటివారగుదురు.

16. So the last shall be first, and the first last. For many are called, but few are chosen."

17. యేసు యెరూషలేమునకు వెళ్లనైయున్నప్పుడు ఆయన పండ్రెండుమంది శిష్యులను ఏకాంతముగా తీసికొనిపోయి, మార్గమందు వారితో ఇట్లనెను.

17. And Jesus, going up to Jerusalem, took the twelve disciples apart on the way and said unto them,

18. ఇదిగో యెరూష లేమునకు వెళ్లుచున్నాము; అక్కడ మనుష్యకుమారుడు ప్రధానయాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును; వారాయనకు మరణశిక్ష విధించి

18. "Behold, we go up to Jerusalem; and the Son of Man shall be betrayed unto the chief priests and unto the scribes, and they shall condemn Him to death,

19. ఆయనను అపహసించు టకును కొరడాలతో కొట్టుటకును సిలువవేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు; మూడవ దినమున ఆయన మరల లేచును.

19. and shall deliver Him to the Gentiles to mock and to scourge and to crucify Him. And the third day, He shall rise again."

20. అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయనయొద్దకు వచ్చి నమస్కారముచేసి యొక మనవి చేయబోగా

20. Then came to Him the mother of Zebedee's children with her sons, worshiping Him and desiring a certain thing of Him.

21. నీవేమి కోరుచున్నావని ఆయన అడిగెను. అందుకామెనీ రాజ్యమందు ఈ నా యిద్దరు కుమారులలో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ యెడమవైపునను కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అనెను.

21. And He said unto her, "What wilt thou?" She said unto Him, "Grant that these my two sons may sit, the one on Thy right hand and the other on the left in Thy Kingdom."

22. అందుకు యేసుమీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు; నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగ గలరా? అని అడుగగా వారుత్రాగగలమనిరి.

22. But Jesus answered and said, "Ye know not what ye ask. Are ye able to drink of the cup that I shall drink of, and to be baptized with the baptism that I am baptized with?" They said unto Him, "We are able."

23. ఆయనమీరు నా గిన్నెలోనిది త్రాగుదురు గాని నా కుడి వైపునను నా యెడమవైపునను కూర్చుండనిచ్చుట నా వశమునలేదు; నా తండ్రిచేత ఎవరికి సిద్ధపరచబడెనో వారికే అది దొరకునని చెప్పెను.

23. And He said unto them, "Ye shall drink indeed of My cup, and be baptized with the baptism that I am baptized with; but to sit on My right hand and on My left is not Mine to give, but it shall be given to them for whom it is prepared by My Father."

24. తక్కిన పదిమంది శిష్యులు ఈ మాట విని ఆ యిద్దరు సహోదరులమీద కోపపడిరి

24. And when the ten heard it, they were moved with indignation against the two brethren.

25. గనుక యేసు తనయొద్దకు వారిని పిలిచిఅన్య జనులలో అధికారులు వారిమీద ప్రభుత్వము చేయుదు రనియు, వారిలో గొప్పవారు వారిమీద అధికారము చేయుదురనియు మీకు తెలియును.

25. But Jesus called them unto Him and said, "Ye know that the princes of the Gentiles exercise dominion over them, and they that are great exercise authority upon them.

26. మీలో ఆలాగుండ కూడదు; మీలో ఎవడు గొప్పవాడై యుండగోరునో వాడు మీ పరిచారకుడై యుండవలెను;

26. But it shall not be so among you; but whosoever will be great among you, let him be your minister;

27. మీలో ఎవడు ముఖ్యుడై యుండగోరునో వాడు మీ దాసుడై యుండ వలెను.

27. and whosoever will be chief among you, let him be your servant,

28. ఆలాగే మనుష్యకుమారుడు పరిచారము చేయించు కొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకు లకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చెనని చెప్పెను.

28. even as the Son of Man came not to be ministered unto, but to minister, and to give His life as a ransom for many."

29. వారు యెరికోనుండి వెళ్లుచుండగా బహు జనసమూ హము ఆయనవెంట వెళ్లెను.

29. And as they departed from Jericho, a great multitude followed Him.

30. ఇదిగో త్రోవప్రక్కను కూర్చున్న యిద్దరు గ్రుడ్డివారు యేసు ఆ మార్గమున వెళ్లు చున్నాడని వినిప్రభువా, దావీదు కుమారుడా, మమ్ము కరుణింపుమని కేకలువేసిరి.

30. And behold, two blind men were sitting by the wayside when they heard that Jesus was passing by, and they cried out, saying, "Have mercy on us, O Lord, Thou Son of David!"

31. ఊరకుండుడని జనులు వారిని గద్దించిరి గాని వారుప్రభువా, దావీదు కుమారుడా, మమ్ము కరుణింపుమని మరి బిగ్గరగా కేకవేసిరి.

31. And the multitude rebuked them, that they should hold their peace; but they cried out the more, saying, "Have mercy on us, O Lord, Thou Son of David!"

32. యేసు నిలిచి వారిని పిలిచి నేను మీకేమి చేయగోరుచున్నారని అడుగగా

32. And Jesus stood still, and called them and said, "What will ye that I shall do unto you?"

33. వారుప్రభువా, మా కన్నులు తెరవవలె ననిరి.

33. They said unto Him, "Lord, that our eyes may be opened."

34. కాబట్టి యేసు కనికరపడి వారి కన్నులు ముట్టెను; వెంటనే వారు దృష్టిపొంది ఆయన వెంట వెళ్లిరి.

34. So Jesus had compassion on them and touched their eyes, and immediately their eyes received sight, and they followed Him.

No comments:

Post a Comment