Hosea - హోషేయా 6

Hosea - హోషేయా 6

 
1. మనము యెహోవాయొద్దకు మరలుదము రండి, ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును; ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగుచేయును

1. Come, and let us return unto the LORD; for He hath torn, and He will heal us; He hath smitten, and He will bind us up.

2. రెండు దినములైన తరువాత ఆయన మనలను బ్రదికించును, మనము ఆయన సముఖమందు బ్రదుకునట్లు మూడవ దినమున ఆయన మనలను స్థిరపరచును.
లూకా 24:46, 1 కోరింథీయులకు 15:4

2. After two days will He revive us; on the third day He will raise us up, and we shall live in His sight.

3. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొందము రండి; యెహో వానుగూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదము రండి. ఉదయము తప్పక వచ్చురీతిని ఆయన ఉదయించును; వర్షమువలె ఆయన మనయొద్దకు వచ్చును; భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షమువలె ఆయన మనయొద్దకు వచ్చును.

3. Then shall we know, if we follow on to know the LORD; His going forth is prepared as the morning; and He shall come unto us as the rain, as the latter and former rain unto the earth.

4. ఎఫ్రాయిమూ, నిన్ను నేనేమిచేతును? యూదా, నిన్ను నేనేమిచేతును? తెల్లవారగానే కనబడు మేఘము ఎగిరిపోవునట్లును, ప్రాతఃకాలమున పడు మంచు ఆరిపోవు నట్లును మీ భక్తి నిలువకపోవును.

4. "O Ephraim, what shall I do unto thee? O Judah, what shall I do unto thee? For your goodness is as a morning cloud, and as the early dew it goeth away.

5. కాబట్టి నేను చేసిన తీర్పులు వెలుగువలె ప్రకాశించునట్లు ప్రవక్తలచేత నేను వారిని కొట్టి బద్దలు చేసియున్నాను, నానోటిమాటల చేత వారిని వధించి యున్నాను.
ఎఫెసీయులకు 6:17

5. Therefore have I hewn them by the prophets; I have slain them by the words of My mouth; and thy judgments are as the light that goeth forth.

6. నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను, దహనబలులకంటె దేవునిగూర్చిన జ్ఞానము నాకిష్టమైనది.
మత్తయి 9:13, మత్తయి 12:7, మార్కు 12:33

6. For I desired mercy, and not sacrifice; and the knowledge of God more than burnt offerings.

7. ఆదాము నిబంధన మీరినట్లు వారు నాయెడల విశ్వాస ఘాతకులై నా నిబంధ నను మీరియున్నారు.

7. But they like Adam have transgressed the covenant; there have they dealt treacherously against Me.

8. గిలాదు పాపాత్ముల పట్టణ మాయెను, అందులో నరహంతకుల అడుగుజాడలు కన బడుచున్నవి.

8. Gilead is a city of them that work iniquity, and is polluted with blood.

9. బందిపోటుదొంగలు పొంచియుండునట్లు యాజకులు పొంచియుండి షెకెము మార్గములో నరహత్య చేసెదరు; వారు ఘోరమైన కాముకత్వము జరిగించు వారై యున్నారు,

9. And as troops of robbers wait for a man, so the company of priests murder on the way by consent; for they commit lewdness.

10. ఇశ్రాయేలువారిలో ఘోరమైన సంగతి యొకటి నాకు కనబడెను, ఎఫ్రాయిమీయులు వ్యభిచారక్రియలు అభ్యాసము చేసెదరు, ఇశ్రాయేలు వారు తమ్మును అపవిత్రపరచు కొనెదరు.

10. I have seen a horrible thing in the house of Israel; there is the whoredom of Ephraim, Israel is defiled.

11. చెరలోనికి వెళ్లిన నా ప్రజలను నేను తిరిగి రప్పించినప్పుడు ఓ యూదా, అతడు నీకు కోత కాలము నిర్ణయించును.

11. Also, O Judah, he hath set a harvest for thee, when I returned My people from captivity.

No comments:

Post a Comment