Ezekiel - యెహేజ్కేలు 42

Ezekiel - యెహేజ్కేలు 42

1. అతడు ఉత్తరమార్గముగా నన్ను నడిపించి బయటి ఆవరణములోనికి తోడుకొని వచ్చి ఖాలీచోటునకును ఉత్తరముననున్న కట్టడమునకును ఎదురుగానున్న గదుల దగ్గర నిలిపెను.

1. Then he brought me forth into the outer court, the way toward the north; and he brought me into the chamber that was opposite the separate place and which was before the building toward the north.

2. ఆ కట్టడము నూరు మూరల నిడివిగలదై ఉత్తరదిక్కున వాకిలికలిగి యేబది మూరల వెడల్పుగలది.

2. Along the length of a hundred cubits was the north door, and the breadth was fifty cubits.

3. ఇరువది మూరలుగల లోపటి ఆవరణమున కెదురుగాను బయటి ఆవరణపు చఎ్టా కెదురుగాను మూడవ అంతస్థు లోని వసారాలు ఒకదానికొకటి యెదురుగా ఉండెను.

3. Opposite the twenty cubits which were for the inner court, and opposite the pavement which was for the outer court, was gallery upon gallery in three stories.

4. గదులకెదురుగా పదిమూరల వెడల్పుగల విహారస్థలముం డెను, లోపటి ఆవరణమునకు పోవుచు ఉత్తరదిక్కు చూచు వాకిండ్లు గల విహారస్థలమొకటి యుండెను, అది మూరెడు వెడల్పు.

4. And before the chambers was a walk of ten cubits breadth inward, a way of one cubit, and their doors toward the north.

5. వాకిండ్లకు వసారాలుండుటవలన పై గదులు ఎత్తు తక్కువగాను మధ్యగదులు ఇరుకుగానుండి కురచవాయెను.

5. Now the upper chambers were shorter; for the galleries were higher than these -- than the lower and than the middlemost of the building.

6. మూడవ అంతస్థులో ఉండినవి ఆవరణ ములకున్న వాటివంటి స్తంభములు వాటికి లేవు గనుక అవి క్రిందిగదులకంటెను మధ్యగదులకంటెను చిన్నవిగా కట్టబడియుండెను.

6. For they were in three stories, but had not pillars as the pillars of the courts; therefore the upper building was narrowed more than the lowest and the middlemost from the ground.

7. మరియు గదుల వరుసనుబట్టి బయటి ఆవరణముతట్టు గదులకెదురుగా ఏబది మూరల నిడివిగల యొక గోడ కట్టబడియుండెను.

7. And the wall that was outside opposite the chambers, toward the outer court on the forepart of the chambers, the length thereof was fifty cubits.

8. బయటి ఆవరణములో నున్న గదుల నిడివి యేబది మూరలుగాని మందిరపు ముందటి ఆవరణము నూరుమూరల నిడివిగలదై యుండెను.

8. For the length of the chambers that were in the outer court was fifty cubits; and lo, those before the temple were a hundred cubits.

9. ఈ గదులు గోడక్రిందనుండి లేచినట్టుగా కనబడెను, బయటి ఆవరణములోనుండి వాటిలో ప్రవేశించుటకు తూర్పు దిక్కున మార్గముండెను.

9. And from under these chambers was the entry on the east side, as one goeth into them from the outer court.

10. విడిచోటునకు ఎదురు గాను కట్టడమున కెదురుగాను ఆవరణపుగోడ మందములో తూర్పుతట్టు కొన్ని గదులుండెను.

10. The chambers were within the thickness of the wall of the court toward the east, opposite the separate place and opposite the building.

11. మరియు వాటి యెదుటనున్న మార్గము ఉత్తరపుతట్టునున్న గదుల మార్గము వలె నుండెను, వాటి నిడివిచొప్పునను వెడల్పు చొప్పు నను ఇవియు కట్టబడెను; వీటి ద్వారములును ఆ రీతినే కట్టబడియుండెను.

11. And the walk before them was like the appearance of the chambers which were toward the north, as long as they and as broad as they; and all their exits were both according to their fashions, and according to their doors.

12. మరియు మార్గపు మొగను దక్షిణపు తట్టు గదులయొక్క తలుపులవలె వీటికి తలుపులుండెను, ఆ మార్గము ఆవరణములోనికి పోవు నొకనికి తూర్పుగా నున్న గోడ యెదుటనే యుండెను.

12. And according to the doors of the chambers that were toward the south was a door in the head of the walk, the passage directly before the wall toward the east as one entereth into them.

13. అప్పుడాయన నాతో ఇట్లనెను విడిచోటునకు ఎదురుగానున్న ఉత్తరపు గదులును దక్షిణపుగదులును ప్రతిష్ఠితములైనవి, వాటి లోనే యెహోవా సన్నిధికి వచ్చు యాజకులు అతిపరిశుద్ధ వస్తు వులను భుజించెదరు, అక్కడ వారు అతిపరిశుద్ధ వస్తువులను, అనగా నైవేద్యమును పాపపరిహారార్థ బలిపశుమాంసమును అపరాధపరిహారార్థ బలిపశుమాంసమును ఉంచెదరు, ఆ స్థలము అతిపరిశుద్ధము.

13. Then said he unto me, "The north chambers and the south chambers, which are in front of the separate place, they are holy chambers where the priests who approach unto the LORD shall eat the most holy things. There shall they lay the most holy things, and the meat offering, and the sin offering, and the trespass offering; for the place is holy.

14. యాజకులు లోపల ప్రవేశించునప్పుడు పరిశుద్ధ స్థలమును విడిచి బయటి ఆవరణములోనికి పోక అక్కడనే తాము పరిచర్య చేయు వస్త్రములను ఉంచవలెను; అవి ప్రతిష్ఠితములైనవి గనుక జనుల సంబంధమైన దేనినైనను వారు ముట్టునప్పుడు వారు వేరుబట్టలు ధరించుకొనవలెను.

14. When the priests enter therein, then shall they not go out of the holy place into the outer court; but there they shall lay their garments wherein they minister, for they are holy; and they shall put on other garments and shall approach those things which are for the people."

15. అతడు లోపటి మందిరమును కొలుచుట ముగించి నన్ను బయటికి తోడుకొని తూర్పుతట్టు చూచు గుమ్మము నకు వచ్చి చుట్టును కొలిచెను.

15. Now when he had made an end of measuring the inner house, he brought me forth toward the gate whose prospect is toward the east, and measured it round about.

16. తూర్పుదిశను చుట్టును కొలకఱ్ఱతో కొలువగా ఐదువందల బారలాయెను.

16. He measured the east side with the measuring reed, five hundred reeds with the measuring reed round about.

17. ఉత్తర దిశను చుట్టును కొలకఱ్ఱతో కొలువగా ఐదువందల బారలును

17. He measured the north side, five hundred reeds with the measuring reed round about.

18. దక్షిణదిశను కొలకఱ్ఱతో కొలువగా ఐదువందల బారలును,

18. He measured the south side, five hundred reeds with the measuring reed.

19. పశ్చిమదిశను తిరిగి కొలకఱ్ఱతో కొలువగా ఐదువందల బారలును తేలెను.

19. He turned about to the west side and measured five hundred reeds with the measuring reed.

20. నాలుగుతట్లు అతడు కొలిచెను; ప్రతిష్ఠితమైన స్థలమును ప్రతిష్ఠితము కాని స్థలమునుండి ప్రత్యేకపరుచుటకై దానిచుట్టు నలుదిశల ఐదువందల బారలుగల చచ్చౌకపు గోడ కట్టబడి యుండెను.

20. He measured it on the four sides; it had a wall round about, five hundred reeds long and five hundred broad, to make a separation between the sanctuary and the profane place.

No comments:

Post a Comment