Corinthians II - 2 కొరింథీయులకు 9

Corinthians II - 2 కొరింథీయులకు 9

 
1. పరిశుద్ధులకొరకైన యీ పరిచర్యనుగూర్చి మీ పేరు వ్రాయుటకు నా కగత్యములేదు.

1. Now concerning the ministering to the saints, it is superfluous for me to write to you.

2. మీ మనస్సు సిద్ధమై యున్నదని నేనెరుగుదును. అందువలనసంవత్సరమునుండి అకయ సిద్ధపడియున్నదని చెప్పి, నేను మిమ్మును గూర్చి మాసిదోనియవారియెదుట అతిశయపడుచున్నాను; మీ ఆసక్తిని చూచి అనేకులు ప్రేరేపింపబడిరి.

2. For I know the forwardness of your thinking, for which I boast of you to those of Macedonia that Achaia was ready a year ago; and your zeal hath called forth very many.

3. అయితే మిమ్మునుగూర్చిన మా అతిశయము ఈ విషయములో వ్యర్థముకాకుండునట్లు, నేను చెప్పిన ప్రకారము మీరు సిద్ధముగా ఉండుటకై యీ సహోదరులను పంపితిని.

3. Yet I have sent the brethren, lest our boasting of you on this account should be in vain, that, as I said, ye may be ready;

4. మీరు సిద్ధపడని యెడల ఒకవేళ మాసిదోనియవారెవరైనను నాతోకూడ వచ్చి మీరు సిద్ధముగా ఉండకపోవుట చూచినయెడల, ఈ నమ్మిక కలిగియున్నందుకు మేము సిగ్గు పరచబడుదుము; మీరును సిగ్గుపరచబడుదురని యిక చెప్పనేల?

4. lest it might happen, if those of Macedonia come with me and find you unprepared, that we (that we say not "ye") should be ashamed in this same confident boasting.

5. కావున లోగడ ఇచ్చెదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయ్యక ధారాళముగా ఇయ్య వలెనని చెప్పి, సహోదరులు మీ యొద్దకు ముందుగావచ్చి దానిని జమచేయుటకై వారిని హెచ్చరించుట అవసరమని తలంచితిని.

5. Therefore I thought it necessary to exhort the brethren to go ahead unto you and make up your bounty beforehand (whereof ye had notice beforehand), that the same might be ready as a matter of bounty, and not as of covetousness.

6. కొంచెముగా విత్తువాడు కొంచె ముగా పంటకోయును, సమృద్ధిగా3 విత్తువాడు సమృద్ధిగా3 పంటకోయును అని యీ విషయమై చెప్పవచ్చును.
సామెతలు 11:24, సామెతలు 22:9

6. But this I say: He who soweth sparingly shall reap also sparingly, and he who soweth bountifully shall reap also bountifully.

7. సణుగుకొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చ యించుకొనిన ప్రకారము ఇయ్య వలెను; దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును.
సామెతలు 22:8

7. As every man purposeth in his heart, so let him give, not grudgingly or out of compulsion; for God loveth the cheerful giver.

8. మరియు అన్నిటియందు ఎల్లప్పుడును మీలో మీరు సర్వసమృద్ధిగలవారై ఉత్తమమైన ప్రతికార్యము చేయుటకు దేవుడు మీయెడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు.

8. And God is able to make all grace abound toward you, that ye, always having all sufficiency in all things, may abound in every good work.

9. ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకిచ్చెను అతని నీతి నిరంతరము నిలుచును అని వ్రాయబడియున్నది.
కీర్తనలు 112:9

9. As it is written: "He hath dispersed abroad, he hath given to the poor; his righteousness remaineth for ever."

10. విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి, మీరు ప్రతి విషయములో పూర్ణౌదార్య భాగ్యముగలవారగునట్లు, మీ నీతిఫలములు వృద్ధిపొం దించును.
యెషయా 55:10, హోషేయా 10:12

10. Now may He that ministereth seed to the sower both minister bread for your food, and multiply your seed sown, and increase the fruits of your righteousness,

11. ఇట్టి, ఔదార్యమువలన మాద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును.

11. ye being enriched in everything to all bountifulness, which causeth through us thanksgiving to God.

12. ఏలయనగా ఈ సేవనుగూర్చిన పరిచర్య పరిశుద్ధుల అక్కరలకు సహాయము కలుగజేయుట మాత్రము కాకుండ, అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతుల మూలముగా విస్తరించుచున్నది.

12. For the administration of this service not only supplieth the want of the saints, but is abundant also in much thanksgiving unto God,

13. ఏలాగనగా క్రీస్తుసువార్తను అంగీకరింతుమని ఒప్పుకొనుట యందు మీరు విధేయులైనందుచేతను, వారి విషయమును అందరి విషయమును ఇంత ఔదార్యముగా ధర్మము చేసి నందుచేతను, ఈ పరిచర్య మూలముగా మీ యోగ్యత కనబడినందున వారు దేవుని మహిమపరచుచున్నారు.

13. while by the experience of this ministration they glorify God for your freely declared subjection unto the Gospel of Christ, and for your liberal distribution unto them and unto all men,

14. మరియు మీయెడల దేవుడు కనుపరచిన అత్యధికమైన కృపను చూచి, వారు మీ నిమిత్తమై ప్రార్థన చేయుచు, మిమ్మును చూడవలెనని ఎక్కువ కోరిక గలవారై యున్నారు.

14. and by their prayer for you, they who long after you for the exceeding grace of God in you.

15. చెప్ప శక్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము.

15. Thanks be unto God for His unspeakable gift!

No comments:

Post a Comment