Psalms - కీర్తనలు 75

Psalms - కీర్తనలు 75

1. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు చున్నాము నీవు సమీపముగా నున్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము నరులు నీ ఆశ్చర్యకార్యములను వివరించుదురు.

1. Unto Thee, O God, do we give thanks, unto Thee do we give thanks. For that Thy name is near, Thy wondrous works declare.

2. నేను యుక్తకాలమును కనిపెట్టుచున్నాను నేనే న్యాయమునుబట్టి తీర్పు తీర్చుచున్నాను.

2. When I shall receive the congregation, I will judge uprightly.

3. భూమియు దాని నివాసులందరును లయమగునప్పుడు నేనే దాని స్తంభములను నిలుపుదును.(సెలా.)

3. When the earth and all the inhabitants thereof are dissolved, I bear up the pillars of it. Selah

4. అహంకారులై యుండకుడని అహంకారులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను.

4. I said unto the fools, "Deal not foolishly," and to the wicked, "Lift not up the horn.

5. కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి పొగరుపట్టిన మాటలాడకుడి అని భక్తిహీనులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను.



5. Lift not up your horn on high; speak not with a stiff neck."

6. తూర్పునుండియైనను పడమటినుండియైనను అరణ్యమునుండియైనను హెచ్చుకలుగదు.

6. For promotion cometh neither from the east, nor from the west, nor from the south,

7. దేవుడే తీర్పు తీర్చువాడు ఆయన ఒకని తగ్గించును ఒకని హెచ్చించును

7. but God is the Judge: He putteth down one, and setteth up another.

8. యెహోవా చేతిలో ఒక పాత్రయున్నది అందులోని ద్రాక్షారసము పొంగుచున్నది, అది సంబారముతో నిండియున్నది ఆయన దానిలోనిది పోయుచున్నాడు భూమిమీదనున్న భక్తిహీనులందరు మడ్డితోకూడ దానిని పీల్చి మింగివేయవలెను.
ప్రకటన గ్రంథం 14:10, ప్రకటన గ్రంథం 15:7, ప్రకటన గ్రంథం 16:19

8. For in the hand of the LORD there is a cup, and the wine is red and fully mixed; and He poureth out the same. But as for the dregs thereof, all the wicked of the earth shall wring them out and drink them.

9. నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురము చేయు దును యాకోబు దేవుని నేను నిత్యము కీర్తించెదను.

9. But I will declare it for ever; I will sing praises to the God of Jacob.

10. భక్తిహీనుల కొమ్ములనన్నిటిని నేను విరుగగొట్టెదను నీతిమంతుల కొమ్ములు హెచ్చింపబడును.

10. All the horns of the wicked will I also cut off, but the horns of the righteous shall be exalted.

No comments:

Post a Comment