Psalms - కీర్తనలు 64

Psalms - కీర్తనలు 64

1. దేవా, నేను మొఱ్ఱపెట్టగా నా మనవి ఆలకింపుము శత్రుభయమునుండి నా ప్రాణమును కాపాడుము.

1. Hear my voice, O God, in my prayer; preserve my life from fear of the enemy.

2. కీడుచేయువారి కుట్రనుండి దుష్టక్రియలు చేయువారి అల్లరినుండి నన్ను దాచుము

2. Hide me from the secret counsel of the wicked, from the insurrection of the workers of iniquity,

3. ఒకడు కత్తికి పదును పెట్టునట్లు వారు తమ నాలుక లకు పదును పెట్టుదురు.

3. who whet their tongue like a sword and bend their bows to shoot their arrows, even bitter words,

4. యథార్థవంతులను కొట్టవలెనని చాటైన స్థలములలో చేదుమాటలను బాణములుగా సంధించుదురు.వారు భయమేమియు లేక అకస్మాత్తుగా వారినికొట్టెదరు

4. that they may shoot in secret at the perfect; suddenly do they shoot at him and fear not.

5. వారు దురాలోచన దృఢపరచుకొందురు చాటుగా ఉరుల నొడ్డుటకు యోచించుకొనుచు మనలను ఎవరు చూచెదరని చెప్పుకొందురు.

5. They encourage each other in an evil purpose; they commune in laying snares privily; they say, "Who shall
see them?"

6. వారు దుష్టక్రియలను తెలిసికొనుటకు ప్రయత్నిం తురు వెదకి వెదకి ఉపాయము సిద్ధపరచుకొందురు ప్రతివాని హృదయాంతరంగము అగాధము.

6. They search out iniquities, they conduct a diligent search; both the inward thought of every one of them, and the heart, is deep.

7. దేవుడు బాణముతో వారిని కొట్టును వారు ఆకస్మికముగా గాయపరచబడెదరు.

7. But God shall shoot at them with an arrow; suddenly shall they be wounded.

8. వారు కూలెదరు వారు కూలుటకు వారి నాలుకే కారణము. వారిని చూచువారందరు తల ఊచుదురు

8. So shall they make their own tongue to fall upon themselves; all that see them shall flee away.

9. మనుష్యులందరు భయముకలిగి దేవుని కార్య ములు తెలియజేయుదురు ఆయన కార్యములు చక్కగా యోచించు కొందురు

9. And all men shall fear and shall declare the work of God, for they shall wisely consider His doing.

10. నీతిమంతులు యెహోవానుబట్టి సంతోషించుచు ఆయన శరణుజొచ్చెదరు యథార్థహృదయులందరు అతిశయిల్లుదురు.

10. The righteous shall be glad in the LORD and shall trust in Him, and all the upright in heart shall glory.

No comments:

Post a Comment