Psalms - కీర్తనలు 62
1. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది. ఆయనవలన నాకు రక్షణ కలుగును. ఆయనే నా ఆశ్రయదుర్గము ఆయనే నా రక్షణకర
1. Truly my soul waiteth upon God; from Him cometh my salvation.
2. ఎత్తయిన నాకోట ఆయనే, నేను అంతగా కదలింప బడను. ఎన్నాళ్లు మీరు ఒకనిపైబడుదురు?
2. He alone is my rock and my salvation; He is my defense; I shall not be greatly moved.
3. ఒరుగుచున్న గోడను పడబోవు కంచెను ఒకడు పడ ద్రోయునట్లు మీ రందరు ఎన్నాళ్లు ఒకని పడ ద్రోయ చూచుదురు?
3. How long will ye conjure mischief against a man? Ye shall be slain, all of you; as a bulging wall shall ye be, and as a tottering fence.
4. అతని ఔన్నత్యమునుండి అతని పడద్రోయుటకే వారు ఆలోచించుదురు అబద్ధమాడుట వారికి సంతోషము వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంత రంగములో దూషించుదురు. (సెలా.)
4. They consult only to cast him down from his excellency, they delight in lies, they bless with their mouth, but they curse inwardly. Selah
5. నా ప్రాణమా, దేవుని నమ్ముకొని మౌనముగా నుండుము ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది.
5. My soul, wait thou only upon God, for my expectation is from Him.
6. ఆయనే నా ఆశ్రయదుర్గము నా రక్షణాధారము నా ఎత్తయిన కోట ఆయనే, నేను కదలింపబడను.
6. He only is my rock and my salvation; He is my defense; I shall not be moved.
7. నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము. నా బలమైన ఆశ్రయదుర్గము నా యాశ్రయము దేవునియందే యున్నది.
7. In God is my salvation and my glory; the rock of my strength and my refuge is in God.
8. జనులారా, యెల్లప్పుడు ఆయనయందు నమ్మిక యుంచుడి ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి దేవుడు మనకు ఆశ్రయము.(సెలా.)
8. Trust in Him at all times, ye people; pour out your heart before Him; God is a refuge for us. Selah
9. అల్పులైనవారు వట్టి ఊపిరియై యున్నారు. ఘనులైనవారు మాయస్వరూపులు త్రాసులో వారందరు తేలిపోవుదురు వట్టి ఊపిరికన్న అలకనగా ఉన్నారు
9. Surely men of low degree are vanity, and men of high degree are a lie; if weighed in the balance, they are altogether lighter than vanity.
10. బలాత్కారమందు నమ్మికయుంచకుడి దోచుకొనుటచేత గర్వపడకుడి ధనము హెచ్చినను దానిని లక్ష్యపెట్టకుడి.
మత్తయి 19:22, 1 తిమోతికి 6:17
10. Trust not in oppression, and put not vain hope in robbery; if riches increase, set not your heart upon them.
11. బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చెను రెండు మారులు ఆ మాట నాకు వినబడెను.
11. God hath spoken this once, twice have I heard this: that power belongeth unto God.
12. ప్రభువా, మనుష్యులకందరికి వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలమిచ్చుచున్నావు. కాగా కృపచూపుటయు నీది.
మత్తయి 16:27, రోమీయులకు 2:6, 2 తిమోతికి 4:14, 1 పేతురు 1:17, ప్రకటన గ్రంథం 2:23, ప్రకటన గ్రంథం 20:12-13, ప్రకటన గ్రంథం 22:12
12. Also unto Thee, O Lord, belongeth mercy, for Thou renderest to every man according to his work.

No comments:
Post a Comment