Psalms - కీర్తనలు 59

Psalms - కీర్తనలు 59

1. నా దేవా, నా శత్రువులచేతిలోనుండి నన్ను తప్పిం పుము. నామీద పడువారికి చిక్కకుండ నన్ను ఉద్ధరించుము.

1. Deliver me from mine enemies, O my God; defend me from them that rise up against me.

2. పాపము చేయువారి చేతిలోనుండి నన్ను తప్పింపుము. రక్తాపరాధుల చేతిలోనుండి నన్ను రక్షింపుము.

2. Deliver me from the workers of iniquity, and save me from bloody men.

3. నా ప్రాణము తీయవలెనని వారు పొంచియున్నారు యెహోవా, నా దోషమునుబట్టి కాదు నా పాప మునుబట్టికాదు ఊరకయే బలవంతులు నాపైని పోగుబడి యున్నారు.

3. For lo, they lie in wait for my soul; the mighty are gathered against me, not for my transgression, nor for my sin, O LORD.

4. నాయందు ఏ అక్రమమును లేకున్నను వారు పరుగు లెత్తి సిద్ధపడుచున్నారు నన్ను కలిసికొనుటకై మేల్కొనుము.

4. They run and prepare themselves though I am not at fault. Awake to help me, and behold!

5. సైన్యములకధిపతియగు యెహోవావైన దేవా, ఇశ్రాయేలు దేవా, అన్యజనులందరిని శిక్షించుటకై మేల్కొనుము
అధికద్రోహులలో ఎవరిని కనికరింపకుము.(సెలా.)

5. Thou therefore, O LORD God of hosts, the God of Israel, awake to visit all the heathen; be not merciful to any wicked transgressors. Selah

6. సాయంకాలమున వారు మరల వచ్చెదరు కుక్కవలె మొరుగుచు పట్టణముచుట్టు తిరుగుదురు.

6. They return at evening; they make a noise like a dog and go round about the city.

7. వినువారెవరును లేరనుకొని వారు తమ నోటనుండి మాటలు వెళ్లగ్రక్కుదురు. వారి పెదవులలో కత్తులున్నవి.

7. Behold, they belch out with their mouth; swords are in their lips; "For who," say they, "doth hear?"

8. యెహోవా, నీవు వారిని చూచి నవ్వుదువు అన్యజనులందరిని నీవు అపహసించుదువు.

8. But Thou, O LORD, shalt laugh at them; Thou shalt hold all the heathen in derision.

9. నా బలమా, నీకొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను నా ఉన్నతమైన దుర్గము దేవుడే.

9. Because of his strength, I will wait upon Thee; for God is my defense.

10. నా దేవుడు తన కృపలో నన్ను కలిసికొనెను నాకొరకు పొంచియున్నవారికి సంభవించినదానిని దేవుడునాకు చూపించును.

10. The God of my mercy shall go before me; God shall let me see my desire upon mine enemies.

11. వారిని చంపకుము ఏలయనగా నా ప్రజలు దానిని మరచిపోదురేమో. మాకేడెమైన ప్రభువా, నీ బలముచేత వారిని చెల్లా చెదరు చేసి అణగగొట్టుము.

11. Slay them not, lest my people forget; scatter them by Thy power and bring them down, O Lord our shield.

12. వారి పెదవుల మాటలనుబట్టియు వారి నోటి పాప మునుబట్టియు వారు పలుకు శాపములనుబట్టియు అబద్ధములనుబట్టియు వారు తమ గర్వములో చిక్కుబడుదురుగాక.

12. For the sin of their mouth and the words of their lips, let them even be taken in their pride, and for the cursing and lying which they speak.

13. కోపముచేత వారిని నిర్మూలము చేయుము వారు లేకపోవునట్లు వారిని నిర్మూలము చేయుము దేవుడుయాకోబు వంశమును ఏలుచున్నాడని భూదిగంతములవరకు మనుష్యులు ఎరుగునట్లు చేయుము.(సెలా.)

13. Consume them in wrath, consume them, that they may not be; and let them know that God ruleth in Jacob unto the ends of the earth. Selah

14. సాయంకాలమున వారు మరల వచ్చెదరు కుక్కవలె మొరుగుచు పట్టణముచుట్టు తిరుగుదురు

14. And at evening let them return, and let them make a noise like a dog and go round about the city.

15. తిండికొరకు వారు ఇటు అటు తిరుగులాడెదరు తృప్తి కలుగనియెడల రాత్రి అంతయు ఆగుదురు.

15. Let them wander up and down for meat, and grumble if they be not satisfied.

16. నీవు నాకు ఎత్తయిన కోటగా ఉన్నావు ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు. నీ బలమునుగూర్చి నేను కీర్తించెదను ఉదయమున నీకృపనుగూర్చిఉత్సాహగానము చేసెదను

16. But I will sing of Thy power, yea, I will sing aloud of Thy mercy in the morning; for Thou hast been my defense and refuge in the day of my trouble.

17. దేవుడు నాకు ఎత్తయిన కోటగాను కృపగల దేవుడుగాను ఉన్నాడు నా బలమా, నిన్నే కీర్తించెదను.

17. Unto Thee, O my Strength, will I sing; for God is my defense, and the God of my mercy.

No comments:

Post a Comment