Psalms - కీర్తనలు 17

Psalms - కీర్తనలు 17

1. యెహోవా, న్యాయమును ఆలకించుము, నా మొఱ్ఱ నంగీకరించుమునా ప్రార్థనకు చెవియొగ్గుము, అది కపటమైన పెదవులనుండి వచ్చునదికాదు.

1. Hear the right, O LORD; attend unto my cry! Give ear unto my prayer, which goeth not out of feigned lips.

2. నీ సన్నిధినుండి నాకు తీర్పు వచ్చునుగాక నీ కనుదృష్టి న్యాయముగా చూచును.

2. Let my sentence come forth from Thy presence; let Thine eyes behold things with equity.

3. రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివినన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచనయుకానరాలేదునోటిమాటచేత నేను అతిక్రమింపను

3. Thou hast tested mine heart; Thou hast visited me in the night; Thou hast tried me and shalt find nothing; I am purposed that my mouth shall not transgress.

4. మనుష్యుల కార్యముల విషయమైతే బలాత్కారుల మార్గముల తప్పించుకొనుటకైనీ నోటిమాటనుబట్టి నన్ను నేను కాపాడుకొనియున్నాను.



4. Concerning the works of men, by the word of Thy lips I have been kept from the paths of the destroyer.

5. నీ మార్గములయందు నా నడకలను స్థిరపరచుకొని యున్నాను.నాకు కాలు జారలేదు.

5. Uphold my goings in Thy paths, that my footsteps slip not.

6. నేను నీకు మొఱ్ఱపెట్టుకొనియున్నాను దేవా, నీవు నాకుత్తరమిచ్చెదవునాకు చెవియొగ్గి నా మాట ఆలకించుము.

6. I have called upon Thee, for Thou wilt hear me, O God; incline Thine ear unto me and hear my speaking.

7. నీ శరణుజొచ్చినవారిని వారిమీదికి లేచువారి చేతి లోనుండి నీ కుడిచేత రక్షించువాడా,

7. Show Thy marvelous lovingkindness, O Thou that savest by Thy right hand them that put their trust in Thee from those that rise up against them.

8. నీ కృపాతిశయములను చూపుము.

8. Keep me as the apple of the eye; hide me under the shadow of Thy wings,

9. ఒకడు తన కనుపాపను కాపాడుకొనునట్లు నన్నుకాపాడుమునన్ను లయపరచగోరు దుష్టులను పోగొట్టి కాపాడుమునన్ను చుట్టుకొను నా ప్రాణశత్రువులచేత చిక్కకుండనునీ రెక్కల నీడక్రింద నన్ను దాచుము.

9. from the wicked that oppress me, from my deadly enemies who compass me about.

10. వారు తమ హృదయమును కఠినపరచుకొనియున్నారువారి నోరు గర్వముగా మాటలాడును.

10. They are enclosed in their own fat; with their mouth they speak proudly.

11. మా అడుగుజాడలను గురుతుపట్టి వారిప్పుడు మమ్ము చుట్టుకొని యున్నారుమమ్మును నేలను కూల్చుటకు గురిచూచుచున్నారు.

11. They have now encompassed us in our steps; they have set their eyes, bowing down to the earth,

12. వారు చీల్చుటకు ఆతురపడు సింహమువలెను చాటైన స్థలములలో పొంచు కొదమసింహము వలెను ఉన్నారు.

12. like a lion that is greedy for his prey, even as a young lion lurking in secret places.

13. యెహోవా లెమ్ము, వానిని ఎదుర్కొని వానిని పడ గొట్టుముదుష్టునిచేతిలోనుండి నీ ఖడ్గముచేత నన్ను రక్షింపుము

13. Arise, O LORD, disappoint them! Cast them down; deliver my soul from the wicked by Thy sword,

14. లోకులచేతిలోనుండి ఈ జీవితకాలములోనే తమ పాలు పొందిన యీ లోకుల చేతిలోనుండినీ హస్తబలముచేత నన్ను రక్షింపుము.నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావువారు కుమారులు కలిగి తృప్తినొందుదురు తమ ఆస్తిని తమ పిల్లలకు విడచిపెట్టుదురు.

14. from men which are Thy hand, O LORD, from men of the world that have their portion in this life, and whose belly Thou fillest with Thy hid treasure: They are full of children, and leave the rest of their substance to their babes.

15. నేనైతే నీతిగలవాడనై నీ ముఖదర్శనము చేసెదను నేను మేల్కొనునప్పుడు నీ స్వరూపదర్శనముతోనా ఆశను తీర్చుకొందును.
ప్రకటన గ్రంథం 22:4

15. As for me, I will behold Thy face in righteousness; I shall be satisfied, when I awake, with Thy likeness.

No comments:

Post a Comment