Psalms - కీర్తనలు 129

Psalms - కీర్తనలు 129

 
1. ఇశ్రాయేలు ఇట్లనును నా ¸యవనకాలము మొదలుకొని పగవారు నాకు అధిక బాధలు కలుగజేయుచు వచ్చిరి

1. "Many a time have they afflicted me from my youth"--may Israel now say--

2. నా ¸యవనకాలము మొదలుకొని నాకు అధిక బాధలు కలుగజేయుచు వచ్చిరి. అయినను వారు నన్ను జయింపలేకపోయిరి.

2. "many a time have they afflicted me from my youth, yet they have not prevailed against me.

3. దున్నువారు నా వీపుమీద దున్నిరి వారు చాళ్లను పొడుగుగా చేసిరి.

3. The plowers plowed upon my back; they made long their furrows."

4. యెహోవా న్యాయవంతుడు భక్తిహీనులు కట్టిన త్రాళ్లు ఆయన తెంపియున్నాడు.

4. The LORD is righteous; He hath cut asunder the cords of the wicked.

5. సీయోను పగవారందరు సిగ్గుపడి వెనుకకు త్రిప్పబడుదురు గాక.

5. Let them all be confounded and turned back that hate Zion.


6. వారు ఇంటిమీద పెరుగు గడ్డివలె నుందురు గాక ఎదుగక మునుపే అది వాడిపోవును

6. Let them be as the grass upon the housetops, which withereth before it groweth up,

7. కోయువాడు తన గుప్పిలినైనను పనలు కట్టువాడు తన ఒడినైనను దానితో నింపు కొనడు.

7. wherewith the mower filleth not his hand, nor he that bindeth sheaves, his bosom.

8. దారిన పోవువారుయెహోవా ఆశీర్వాదము నీమీద నుండునుగాక యెహోవా నామమున మేము మిమ్ము దీవించు చున్నాము అని అనకయుందురు.

8. Neither do those who go by say, "The blessing of the LORD be upon you; we bless you in the name of the LORD."

No comments:

Post a Comment