Proverbs - సామెతలు 7

Proverbs - సామెతలు 7

1. నా కుమారుడా, నా మాటలను మనస్సున నుంచు కొనుము నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకొనుము.

1. My son, keep my words, and lay up my commandments with thee.

2. నా ఆజ్ఞలను నీవు మనస్సున నుంచుకొనినయెడల నీ కనుపాపవలె నా ఉపదేశమును కాపాడినయెడల నీవు బ్రదుకుదువు.

2. Keep my commandments and live, and my law as the apple of thine eye.

3. నీ వ్రేళ్లకు వాటిని కట్టుకొనుము నీ హృదయమను పలకమీద వాటిని వ్రాసికొనుము
2 కోరింథీయులకు 3:3

3. Bind them upon thy fingers; write them upon the tablet of thine heart.

4. జ్ఞానముతోనీవు నాకు అక్కవనియు తెలివితోనీవు నాకు చెలికత్తెవనియు చెప్పుము.

4. Say unto wisdom, "Thou art my sister," and call understanding thy kinswoman,

5. అవి నీవు జారస్త్రీయొద్దకు పోకుండను ఇచ్చకములాడు పరస్త్రీకి లోబడకుండను నిన్ను కాపాడును.

5. that they may keep thee from the strange woman, from the harlot who flattereth with her words.

6. నా యింటి కిటికీలోనుండి నా అల్లిక కిటికీలోనుండి నేను పారజూడగా జ్ఞానములేనివారి మధ్యను

6. For at the window of my house I looked through my casement,

7. ¸యవనుల మధ్యను బుద్ధిలేని పడుచువాడొకడు నాకు కనబడెను.

7. and I beheld among the simple ones, I discerned among the youth, a young man void of understanding,

8. సందెవేళ ప్రొద్దు గ్రుంకినతరువాత చిమ్మచీకటిగల రాత్రివేళ

8. passing through the street near her corner; and he went the way to her house,

9. వాడు జారస్త్రీ సందుదగ్గరనున్న వీధిలో తిరుగు చుండెను దాని యింటిమార్గమున నడుచుచుండెను.

9. in the twilight, in the evening, in the black and dark night.

10. అంతట వేశ్యావేషము వేసికొనిన కపటముగల స్త్రీ ఒకతె వానిని ఎదుర్కొన వచ్చెను.

10. And behold, there met him a woman with the attire of a harlot and subtle of heart.

11. అది బొబ్బలు పెట్టునది, స్వేచ్ఛగా తిరుగునది, దాని పాదములు దాని యింట నిలువవు.

11. (She is loud and stubborn, her feet abide not in her house;

12. ఒకప్పుడు ఇంటియెదుటను ఒకప్పుడు సంతవీధులలోను అది యుండును. ప్రతి సందుదగ్గరను అది పొంచియుండును.

12. now is she outside, now in the streets and lieth in wait at every corner.)

13. అది వానిని పట్టుకొని ముద్దుపెట్టుకొనెను సిగ్గుమాలిన ముఖము పెట్టుకొని యిట్లనెను

13. So she caught him and kissed him, and with an impudent face said unto him:

14. సమాధానబలులను నేను అర్పింపవలసియుంటిని నేడు నా మ్రొక్కుబళ్లు చెల్లించియున్నాను

14. "I have peace offerings with me; this day have I paid my vows.

15. కాబట్టి నేను నిన్ను కలిసికొనవలెనని రాగా నిన్ను ఎదుర్కొనవలెనని బయలుదేరగా నీవేకనబడితివి

15. Therefore came I forth to meet thee, diligently seeking thy face, and I have found thee.

16. నా మంచముమీద రత్నకంబళ్లను ఐగుప్తునుండి వచ్చు విచిత్రపుపనిగల నారదుప్పట్లను నేను పరచియున్నాను.

16. I have decked my bed with coverings of tapestry, with carved works, with fine linen of Egypt.

17. నా పరుపుమీద బోళము అగరు కారపుచెక్క చల్లి యున్నాను.

17. I have perfumed my bed with myrrh, aloes, and cinnamon.

18. ఉదయము వరకు వలపుదీర తృప్తిపొందుదము రమ్ము పరస్పరమోహముచేత చాలా సంతుష్టి నొందుదము రమ్ము.

18. Come, let us take our fill of love until the morning; let us solace ourselves with love.

19. పురుషుడు ఇంట లేడు దూరప్రయాణము వెళ్లియున్నాడు

19. For the master is not at home; he is gone on a long journey.

20. అతడు సొమ్ముసంచి చేత పట్టుకొని పోయెను. పున్నమనాటివరకు ఇంటికి తిరిగి రాడు అనెను

20. He hath taken a bag of money with him, and will come home at the day appointed."

21. అది తన అధికమైన లాలనమాటలచేత వానిని లోపరచు కొనెను తాను పలికిన యిచ్చకపుమాటలచేత వాని నీడ్చుకొని పోయెను.

21. With her much fair speech she caused him to yield; with the flattering of her lips she forced him.

22. వెంటనే పశువు వధకు పోవునట్లును పరులచే జిక్కినవాడు సంకెళ్లలోనికి పోవునట్లును

22. He goeth after her straightway, as an ox goeth to the slaughter, or as a fool to the correction of the stocks,

23. తనకు ప్రాణహానికరమైనదని యెరుగక ఉరియొద్దకు పక్షి త్వరపడునట్లును వాని గుండెను అంబు చీల్చువరకు వాడు దానివెంట పోయెను.

23. until a dart strike through his liver, as a bird hasteneth to the snare and knoweth not that it is for his life.

24. నా కుమారులారా, చెవియొగ్గుడి నా నోటి మాటల నాలకింపుడి

24. Hearken unto me now, therefore, O ye children, and attend to the words of my mouth.

25. జారస్త్రీ మార్గములతట్టు నీ మనస్సు తొలగనియ్యకుము దారి తప్పి అది నడచు త్రోవలలోనికి పోకుము.

25. Let not thine heart decline to her ways; go not astray in her paths.

26. అది గాయపరచి పడద్రోసినవారు అనేకులు అది చంపినవారు లెక్కలేనంతమంది

26. For she hath cast down many wounded; yea, many strong men have been slain by her.

27. దాని యిల్లు పాతాళమునకుపోవు మార్గము ఆ మార్గము మరణశాలలకు దిగిపోవును.

27. Her house is the way to hell, leading down to the chambers of death.

No comments:

Post a Comment