Isaiah - యెషయా 34

Isaiah - యెషయా 34

1. రాష్ట్రములారా, నాయొద్దకు వచ్చి వినుడి జనములారా, చెవి యొగ్గి ఆలకించుడి భూమియు దాని సంపూర్ణతయు లోకమును దానిలో పుట్టినదంతయు వినును గాక.

1. Come near, ye nations, to hear; and hearken, ye people! let the earth hear, and all that is therein, the world, and all things that come forth from it.

2. యెహోవా కోపము సమస్త జనములమీదికి వచ్చు చున్నది వారి సర్వ సైన్యములమీద ఆయన క్రోధము వచ్చు చున్నది ఆయన వారిని శపించి వధకు అప్పగించెను.

2. For the indignation of the LORD is upon all nations, and His fury upon all their armies; He hath utterly destroyed them; He hath delivered them to the slaughter.

3. వారిలో చంపబడినవారు బయట వేయబడెదరు వారి శవములు కంపుకొట్టును వారి రక్తమువలన కొండలు కరగిపోవును.

3. Their slain also shall be cast out, and their stench shall come up out of their carcasses, and the mountains shall be melted with their blood.

4. ఆకాశ సైన్యమంతయు క్షీణించును కాగితపు చుట్టవలె ఆకాశవైశాల్యములు చుట్టబడును. ద్రాక్షావల్లినుండి ఆకు వాడి రాలునట్లు అంజూరపుచెట్టునుండి వాడినది రాలునట్లు వాటి సైన్యమంతయు రాలిపోవును.
మత్తయి 24:29, మార్కు 13:25, లూకా 21:26, 2 పేతురు 3:12, ప్రకటన గ్రంథం 6:13-14

4. And all the host of heaven shall be dissolved, and the heavens shall be rolled together as a scroll; and all their host shall fall down, as the leaf falleth off from the vine, and as a falling fig from the fig tree.

5. నిజముగా ఆకాశమందు నా ఖడ్గము మత్తిల్లును ఎదోముమీద తీర్పుతీర్చుటకు నేను శపించిన జనముమీద తీర్పుతీర్చుటకు అది దిగును

5. "For My sword shall be bathed in heaven; behold, it shall come down upon Edom and upon the people of My curse in judgment."

6. యెహోవా ఖడ్గము రక్తమయమగును అది క్రొవ్వుచేత కప్పబడును గొఱ్ఱపిల్లలయొక్కయు మేకలయొక్కయు రక్తము చేతను పొట్లేళ్ల మూత్రగ్రంథులమీది క్రొవ్వుచేతను కప్ప బడును ఏలయనగా బొస్రాలో యెహోవా బలి జరిగించును ఎదోము దేశములో ఆయన మహా సంహారము చేయును.

6. The sword of the LORD is filled with blood; it is made fat with fatness and with the blood of lambs and goats, with the fat of the kidneys of rams; for the LORD hath a sacrifice in Bozrah, and a great slaughter in the land of Edom.

7. వాటితోకూడ గురుపోతులును వృషభములును కోడె లును దిగిపోవుచున్నవి ఎదోమీయుల భూమి రక్తముతో నానుచున్నది వారి మన్ను క్రొవ్వుతో బలిసియున్నది.

7. And the unicorns shall come down with them, and the bullocks with the bulls; and their land shall be soaked with blood, and their dust made fat with fatness.

8. అది యెహోవా ప్రతిదండనచేయు దినము సీయోను వ్యాజ్యెమునుగూర్చిన ప్రతికార సంవత్సరము.

8. For it is the day of the LORD's vengeance, and the year of recompenses for the controversy of Zion.

9. ఎదోము కాలువలు కీలగును దాని మన్ను గంధకముగా మార్చబడును దాని భూమి దహించు గంధకముగా ఉండును.

9. And the streams thereof shall be turned into pitch and the dust thereof into brimstone, and the land thereof shall become burning pitch.

10. అది రేయింబగళ్లు ఆరక యుండును దాని పొగ నిత్యము లేచును అది తరతరములు పాడుగా నుండును ఎన్నడును ఎవడును దానిలో బడి దాటడు
ప్రకటన గ్రంథం 14:11, ప్రకటన గ్రంథం 19:3

10. It shall not be quenched night nor day; the smoke thereof shall go up for ever. From generation to generation it shall lie waste; none shall pass through it for ever and ever.

11. గూడబాతులును ఏదుపందులును దాని ఆక్రమించు కొనును గుడ్లగూబయు కాకియు దానిలో నివసించును ఆయన తారుమారు అను కొలనూలును చాచును శూన్యమను గుండును పట్టును.
ప్రకటన గ్రంథం 18:2

11. But the cormorant and the bittern shall possess it; the owl also and the raven shall dwell in it; and He shall stretch out upon it the line of confusion and the stones of emptiness.

12. రాజ్యము ప్రకటించుటకు వారి ప్రధానులు అక్కడ లేకపోవుదురు దాని అధిపతులందరు గతమైపోయిరి.
ప్రకటన గ్రంథం 6:15

12. They shall call the nobles thereof to the kingdom, but none shall be there, and all her princes shall be nothing.

13. ఎదోము నగరులలో ముళ్లచెట్లు పెరుగును దాని దుర్గములలో దురదగొండ్లును గచ్చలును పుట్టును అది అడవికుక్కలకు నివాసస్థలముగాను నిప్పుకోళ్లకు సాలగాను ఉండును

13. And thorns shall come up in her palaces, nettles and brambles in the fortresses thereof; and it shall be a habitation of dragons and a court for owls.

14. అడవిపిల్లులును నక్కలును అచ్చట కలిసికొనును అచ్చట అడవిమేక తనతోటి జంతువును కనుగొనును అచ్చట చువ్వపిట్ట దిగి విశ్రమస్థలము చూచుకొనును
ప్రకటన గ్రంథం 18:2

14. The wild beasts of the desert shall also meet with the wild beasts of the island, and the satyr shall cry to his fellow; the screech owl also shall rest there and find for herself a place of rest.

15. చిత్తగూబ గూడు కట్టుకొనును అచ్చట గుడ్లు పెట్టి పొదిగి నీడలో వాటిని కూర్చును అచ్చటనే తెల్లగద్దలు తమ జాతిపక్షులతో కూడు కొనును.

15. There shall the great owl make her nest, and lay and hatch and gather under her shadow; there shall the vultures also be gathered, every one with her mate.

16. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి ఆ జంతువులలో ఏదియు లేక యుండదు దేని జతపక్షి దానియొద్ద ఉండక మానదు నా నోటనుండి వచ్చిన ఆజ్ఞ యిదే ఆయన నోటి ఊపిరి వాటిని పోగుచేయును.

16. Seek ye out of the book of the LORD, and read: No one of these shall fail, none shall lack her mate; for My mouth, it hath commanded, and His Spirit, it hath gathered them.

17. అవి రావలెనని ఆయన చీట్లువేసెను ఆయన కొలనూలు చేత పట్టుకొని వాటికి ఆ దేశమును పంచిపెట్టును. అవి నిత్యము దాని ఆక్రమించుకొనును యుగయుగములు దానిలో నివసించును.

17. And He hath cast the lot for them, and His hand hath divided it unto them by line; they shall possess it for ever; from generation to generation shall they dwell therein.

No comments:

Post a Comment