Genesis - ఆదికాండము 28

Genesis - ఆదికాండము 28

 
1. ఇస్సాకు యాకోబును పిలిపించినీవు కనాను కుమార్తెలలో ఎవతెను వివాహము చేసికొనకూడదు.

1. And Isaac called Jacob and blessed him, and charged him and said unto him, "Thou shalt not take a wife of the daughters of Canaan.

2. నీవు లేచి పద్దనరాములోనున్న నీ తల్లికి తండ్రియైన బెతూయేలు ఇంటికి వెళ్లి అక్కడ నీ తల్లి సహోదరుడగు లాబాను కుమార్తెలలో ఒకదానిని వివాహము చేసికొనుమని యతనికి ఆజ్ఞాపించి

2. Arise, go to Padanaram to the house of Bethuel thy mother's father, and take thee a wife from thence of the daughters of Laban thy mother's brother.

3. సర్వశక్తిగల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగునట్లు నీకు సంతానాభి వృద్ధి కలుగజేసి నిన్ను విస్తరింపజేసి నీవు పరవాసివైన దేశ మును, అనగా దేవుడు అబ్రాహామ

3. And God Almighty bless thee, and make thee fruitful, and multiply thee, that thou mayest be a multitude of people;

4. ఆయన నీకు, అనగా నీకును నీతో కూడ నీ సంతానమునకును అబ్రాహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయునుగాక అని అతని దీవించి

4. and give thee the blessing of Abraham to thee and to thy seed with thee, that thou mayest inherit the land wherein thou art a stranger, which God gave unto Abraham."

5. యాకోబును పంపివేసెను. అతడు పద్దన రాములోనున్న సిరియావాడగు బెతూయేలు కుమారుడును, యాకోబు ఏశావుల తల్లియగు రిబ్కా సహోదరుడునైన లాబానునొద్దకు వెళ్లెను.

5. And Isaac sent away Jacob; and he went to Padanaram unto Laban, son of Bethuel the Syrian, the brother of Rebekah, Jacob's and Esau's mother.

6. ఇస్సాకు యాకోబును దీవించి, పద్దనరాములో పెండ్లిచేసికొని వచ్చుటకై అతని నక్కడికి పంపెననియు, అతని దీవించినప్పుడునీవు కనాను దేశపు కుమార్తెలలో ఎవరిని పెండ్లి చేసికొనవద్దని అతనికి ఆజ్ఞాపించెననియు

6. When Esau saw that Isaac had blessed Jacob, and sent him away to Padanaram to take him a wife from thence, and that as he blessed him he gave him a charge, saying, "Thou shalt not take a wife of the daughters of Canaan,"

7. యాకోబు తన తల్లిదండ్రుల మాట విని పద్దనరామునకు వెళ్లి పోయెననియు ఏశావు తెలిసికొని నప్పుడు,

7. and that Jacob obeyed his father and his mother and had gone to Padanaram,

8. ఇదిగాక కనాను కుమార్తెలు తన తండ్రియైన ఇస్సాకునకు ఇష్టురాండ్రు కారని ఏశావునకు తెలిసి నప్పుడు

8. and Esau seeing that the daughters of Canaan pleased not Isaac his father--

9. ఏశావు ఇష్మాయేలు నొద్దకు వెళ్లి, తనకున్న భార్యలుగాక అబ్రాహాము కుమారుడైన ఇష్మాయేలు కుమా ర్తెయు నెబాయోతు సహోదరియునైన మహలతును కూడ పెండ్లి చేసికొనెను.

9. then went Esau unto Ishmael, and added unto the wives which he had Mahalath the daughter of Ishmael, Abraham's son, the sister of Nebajoth, to be his wife.

10. యాకోబు బెయేర్షెబానుండి బయలుదేరి హారాను వైపు వెళ్లుచు

10. And Jacob went out from Beersheba, and went toward Haran.

11. ఒకచోట చేరి ప్రొద్దు గ్రుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి, ఆ చోటి రాళ్లలో ఒకటి తీసికొని తనకు తలగడగా చేసికొని, అక్కడ పండు కొనెను.

11. And he alighted upon a certain place, and tarried there all night, because the sun was set; and he took of the stones of that place and put them for his pillows, and lay down in that place to sleep.

12. అప్పుడతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమిమీద నిలుపబడియుండెను; దాని కొన ఆకాశమునంటెను; దానిమీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచునుండిరి.
యోహాను 1:51

12. And he dreamed, and behold, a ladder was set up on the earth, and the top of it reached to heaven; and behold, the angels of God were ascending and descending on it.

13. మరియు యెహోవా దానికి పైగా నిలిచినేను నీ తండ్రియైన అబ్రాహాము దేవుడను ఇస్సాకు దేవుడైన యెహోవాను; నీవు పండుకొనియున్న యీ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను.

13. And behold, the LORD stood above it and said, "I am the LORD God of Abraham thy father and the God of Isaac: The land whereon thou liest, to thee will I give it, and to thy seed.

14. నీ సంతానము భూమిమీద లెక్కకు ఇసుక రేణువులవలెనగును; నీవు పడమటి తట్టును తూర్పుతట్టును ఉత్తరపు తట్టును దక్షిణపు తట్టును వ్యాపించెదవు, భూమియొక్క వంశములన్నియు నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును.

14. And thy seed shall be as the dust of the earth, and thou shalt spread abroad to the west and to the east, and to the north and to the south; and in thee and in thy seed shall all the families of the earth be blessed.

15. ఇదిగో నేను నీకు తోడై యుండి, నీవు వెళ్లు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరల రప్పించెదను; నేను నీతో చెప్పినది నెరవేర్చువరకు నిన్ను విడువనని చెప్పగా
హెబ్రీయులకు 13:5

15. And behold, I am with thee, and will keep thee in all places whither thou goest, and will bring thee again into this land; for I will not leave thee, until I have done that which I have spoken to thee of."

16. యాకోబు నిద్ర తెలిసినిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు; అది నాకు తెలియక పోయెననుకొని

16. And Jacob awaked out of his sleep, and he said, "Surely the LORD is in this place, and I knew it not."

17. భయపడిఈ స్థలము ఎంతో భయంకరము. ఇది దేవుని మందిరమే గాని వేరొకటికాదు;

17. And he was afraid and said, "How fearsome is this place! This is none other than the house of God, and this is the gate of heaven."

18. పరలోకపు గవిని ఇదే అనుకొనెను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసికొనిన రాయితీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొనమీద నూనె పోసెను.

18. And Jacob rose up early in the morning, and took the stone that he had put for his pillows, and set it up for a pillar and poured oil upon the top of it.

19. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు.

19. And he called the name of that place Bethel [that is, The house of God]; but the name of that city was called Luz at the first.

20. అప్పుడు యాకోబునేను తిరిగి నా తండ్రి యింటికి క్షేమముగా వచ్చునట్లు దేవుడు నాకు తోడైయుండి, నేను వెళ్లుచున్న యీ మార్గములో నన్ను కాపాడి,

20. And Jacob vowed a vow, saying, "If God will be with me and will keep me in this way that I go, and will give me bread to eat and raiment to put on,

21. తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన యెడల యెహోవా నాకు దేవుడై యుండును.

21. so that I come again to my father's house in peace, then shall the LORD be my God.

22. మరియు స్తంభముగా నేను నిలిపిన యీ రాయి దేవుని మందిరమగును; మరియు నీవు నా కిచ్చు యావత్తులో పదియవవంతు నిశ్చయముగా నీకు చెల్లించెదనని మ్రొక్కు కొనెను.

22. And this stone which I have set for a pillar shall be God's house; and of all that Thou shalt give me I will surely give a tenth unto Thee."

No comments:

Post a Comment